Begin typing your search above and press return to search.
మోదీకి రాపోలు ఆనంద్ లేఖ.. అందులో ఏముందంటే
By: Tupaki Desk | 31 Aug 2021 5:00 PM ISTదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లేఖ రాశారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రంలో ఉన్న డిమాండ్ ఆధారంగా కులాల వారీగా జనగణన చేపట్టాలన్నారు. కులాల వారీగా జనగణన చేయాలని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మోదీ ఆధ్వర్యంలో అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
ఈ కులాల ఆధారిత జనగణన కూడా మోదీ నేతృత్వంలో జరగాలని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కమిటీల సూచనల మేరకు మోదీ కులాల వారీగా జన గణనపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం సందర్భంగా కులాల ఆధారిత జనగణనకి శ్రీకారం చుట్టాలన్నారు. కులాల వారీగా జనగణన వల్ల సామాజిక న్యాయం, కేంద్ర పధకాలు పారదర్శకంగా వెనకబడిన తరగతులకి అందే అవకాశం ఉంటుందని రాపోలు ఆనంద భాస్కర్ లేఖలో పొందుపరిచారు.
కులాల వారీగా జనగణన వల్ల సామాజిక న్యాయం, కేంద్ర పథకాలు పారదర్శకంగా వెనకబడిన తరగతులకి అందే అవకాశం ఉంటుందని భాస్కర్ అభిప్రాయపడ్డారు. కాగా, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో కొనసాగిన ఉండిన రాపోలు ఆనంద భాస్కర్ 2019 ఏప్రిల్‌లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 1994 లో కాంగ్రెస్ పార్టీ చేరడానికి ముందు ఆనంద భాస్కర్ జర్నలిస్ట్ గా పనిచేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం లో మేనేజర్ గా పనిచేసారు. తెలంగాణ కోసం రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ మానిటరింగ్ గ్రూప్ నడిపారు. ఏపీసీసీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2012 లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనీయాగాంధీ చే రాజ్యసభకు ఎన్నికయ్యారు