Begin typing your search above and press return to search.
రేప్ చేసినోడిని రక్షించింది!
By: Tupaki Desk | 6 July 2016 2:38 PM ISTదారుణంగా రేప్ కి గురైన బాధితురాలి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? తాను ఎవరి కారణంగా అన్యాయానికి గురయ్యానో.. వారిపై చర్యలు తీసుకునేలా.. వారికి శిక్షపడేలా చేయాలని తపిస్తారు. తనకు అన్యాయం చేసిన వారిని పట్టుకునేందుకు వీలైనన్ని వివరాల్ని పోలీసులకు అందించటం చూస్తుంటాం. కానీ.. జర్మనీకి చెందిన రాజకీయ నాయకురాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి విచారణ అధికారులకు షాకిచ్చిన విషయం తెలిసి ఇప్పుడు అందరూ విస్మయానికి గురి అవుతున్నారు.
సిరియా.. ఇరాక్ తదితర దేశాల్లో ఐఎస్ కారణంగా దేశం విడిచి యూరప్ కు వెళ్తున్న లక్షలాది వలసజీవుల తరఫున పోరాటం చేస్తున్న జర్మనీకి చెందిన యువ మహిళా పొలిటీషియన్.. 25 ఏల్ల సెలిన్ గోరెన్.. అదే వలస వారి కారణంగా అత్యాచారానికి గురయ్యారు. అర్థరాత్రి వేళ ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన వలసవాదులు ఆమెను రేప్ చేశారు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు వెల్లడించారు. ఆమె ఇచ్చిన వివరాల్ని నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆమెను రేప్ చేసింది వలస వాదులే అయినప్పటికీ.. తాను ఆ వాస్తవాన్ని చెబితే.. వలసవాదుల మీద స్థానికుల్లో మరింత ఆగ్రహం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని దాచి పెట్టి స్థానికులే తనను రేప్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఆమెను అత్యాచారం చేసిన వారు అరబిక్.. పార్సీ భాషల్లో మాట్లాడినట్లుగా గుర్తించినప్పటికీ.. పోలీసులకు మాత్రం జర్మన్ మాట్లాడినట్లుగా చెప్పింది. జాతి వివక్షను దూరం చేసేందుకే తానీ పని చేసినట్లుగా తాజాగా పోలీసు అధికారుల విచారణలో వెల్లడించింది. గోరెన్ చెప్పిన వివరాలు సరిపోకపోవటంతో అనుమానం వచ్చిన విచారణ అధికారులు ఆమెను ప్రశ్నించగా తాను చేసిన పనిని ఆమె ఒప్పుకుంది. ఎంత వివక్ష పోవాలంటే మాత్రం దుర్మార్గానికి పాల్పడిన వారిని సేవ్ చేయాలనుకోవటం ఏమిటి? ఇలాంటి మంచితనాన్ని అలుసుగా తీసుకొని మరికొంతమందిపై దారుణాలకు పాల్పడితే..?