Begin typing your search above and press return to search.
లిక్కర్ తాగించి యువతిపై రేప్.. ఆమె ఫోన్ కు న్యూడ్ వీడియోలు
By: Tupaki Desk | 13 Oct 2020 9:30 PM ISTహైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం జరిగింది. ముంబైకి చెందిన ఓ యువతికి బలవంతంగా మద్యం తాగించి ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మే నెలలో ఇది జరిగినట్టు సమాచారం.
అప్పుడే బాధితురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వాట్సాప్ ద్వారా నిందితుడు బాధితురాలికి న్యూడ్ వీడియోలు పంపించి బెదిరించాడు. దీంతో మరోసారి బాధితురాలు ముంబై పోలీసులకు ఈ దారుణంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జుబేర్, ప్రజక్త, స్వీటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబైకి చెందిన బాధితురాలు, తన స్నేహితురాలితో కలిసి మే 11న హైదరాబాద్ వచ్చింది. ఓ బర్త్ డే పార్టీ కోసం వచ్చారు. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ లో బస చేశారు. అదే రోజు రాత్రి హోటల్ లోనే బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. అనంతరం ముగ్గురు కలిసి బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించారు. తర్వాత జుబేర్ బాధితురాలిపై అత్యాచారం చేసి.. స్వీటితో కలిసి హోటల్ నుంచి వెళ్లిపోయాడు.
మే 14న ముంబై వెళ్లిన బాధితురాలి పోలీసులను ఆశ్రయించి జుబైర్ పై రేప్ కేసు పెట్టింది.అయితే తాజాగా కేసు వాపస్ తీసుకోకుంటే నాడు తీసిన వీడిన వీడియోలు యూట్యూబ్ లో పెడుతానంటూ బాధితురాలికి జుబేర్ బెదిరించాడు.
దీంతో బాధితురాలు మరోసారి ముంబై పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరగడంతో కేసును ముంబై పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తాజాగా బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.