Begin typing your search above and press return to search.

77ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. కామాంధుడికి జీవితఖైదు

By:  Tupaki Desk   |   21 Aug 2020 3:20 PM IST
77ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. కామాంధుడికి జీవితఖైదు
X
కామంతో కళ్లు మూసుకొని పోతే ఆడది కనపడితే చాలు అత్యాచారం చేసే మృగాళ్లు ఇంకా మన సమాజంలో ఉన్నారు. అయితే 77 ఏళ్ల పండు ముదుసలి అని కూడా చూడకుండా ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ కామాంధుడు. ఆ కేసులో రేపిస్టుకు కోర్టు సంచలన తీర్పును ఇచ్చి కటకటాల వెనక్కి నెట్టింది.

77 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన నిందితుడికి తాజాగా విజయవాడ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిన్నబోయిన కోటేశ్వరరావు (48) అనే వ్యక్తి 2016 నవంబర్ 27న 77 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముగించారు.

తాజాగా అన్ని ఆధారాలతో నిందితుడిపై చార్జీషీటు దాఖలు చేశారు. న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించింది. దీంతో అతడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

కాగా కోటేశ్వరరావుపై అంతకుముందే రౌడీ షీటు ఉంది. అతడిపై 22 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.