Begin typing your search above and press return to search.

మళ్లీ లవ్ జిహాద్.. కలకలం..

By:  Tupaki Desk   |   24 Sept 2019 10:55 AM IST
మళ్లీ లవ్ జిహాద్.. కలకలం..
X
లవ్ జిహాద్.. మళ్లీ దేశంలో వెలుగుచూసింది. కొన్నేళ్ల క్రితం వరకూ పాకిస్తాన్ ప్రేరేపితులు.. కొంత మంది ముస్లిం యువకులు దీన్నొక పెద్ద ఉద్యమంగా చేసి హిందూ యువతులే టార్గెట్ గా ముందుకెళ్లారు. దేశంలో కలకలం రేపిన ఈ లవ్ జిహాద్ తాజాగా మరోసారి కేరళలో బయటపడి సంచలనం సృష్టించింది.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ లవ్ జిహాద్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపింది. ఈ కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించి వారిపై కఠిన చర్యలు తీసుకుంది. దీంతో కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన ఈ లవ్ జిహాద్ తాజాగా కేరళలో మరోసారి బయటపడింది.

కేరళలోని కోజికోడ్ లోని ఓ ట్యూషన్ సెంటర్ లో ఫజల్ (21) అనే యువకుడు తన క్లాస్ మేట్ అయిన హిందూ యువతి (19)ని నమ్మించాడు. తనతోపాటు తీసుకెళ్లి ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి సృహతప్పాక ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె నగ్నచిత్రాలు - వీడియోలు తీసి ఇస్లాం మతంలోకి మారకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు.

ఫజల్ వేధింపులు ఎక్కువ కావడంతో సదురు బాధిత హిందూయువతి తండ్రికి చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ‘లవ్ జిహాద్’ కేసు కావడంతో దీన్ని ఎన్ఐఏకు కేరళ పోలీసులు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు కావడంతో ఫజల్ పరారీలో ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది.