Begin typing your search above and press return to search.

జనసేన కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాపాక ... ఏమిటంటే !

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:24 AM GMT
జనసేన కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాపాక ... ఏమిటంటే !
X
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అగ్ర నాయకత్వానికి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. జనసేన పార్టీ నుండి అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అయన ప్రభుత్వానికి మద్దతుగా అసెంబ్లీ లో మాట్లాడుతుంటారు. అసెంబ్లీ బయట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ఏపీ ప్రభుత్వం పై , సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపిస్తుంటే ...ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మాత్రం అసెంబ్లీ లో జై జగన్ అంటూ ప్రభుత్వానికి మద్దతుగా తన వాణిని వినిపిస్తుంటారు. అయన ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టినప్పటి నుండి పార్టీ నిర్ణయాలు, సిద్దాంతాలకు ఏనాడూ కట్టుబడినట్లు కనిపించలేదు. తాను చెప్పదలచుకున్నది నిరభ్యంతరంగా చెప్పేస్తున్నారు. తాను చేయదలచుకున్నది ఏ మాత్రం సంకోచం లేకుండా చేసేస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల పై జనసేన వాణి ని అసెంబ్లీ లో వినిపించాలని పార్టీ విప్ జారీ చేసినప్పటికి కూడా ..తనదైన శైలోనే మరోసారి పార్టీ విప్ ని సైతం పట్టించుకోకుండా జగన్ కి జై కొట్టారు.

ఇకపోతే , ఈ మధ్య జనసేన నేషనల్ పార్టీ అయిన బీజేపీ తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత తాజాగా జాతీయ బీజేపీ అధినేత జేపీ నడ్డాను పవన్ వెళ్లి స్వయంగా వెళ్లి కలిశారు. ఈ నేపథ్యం లో జనసేన సత్తా ఏమిటో చూపించడానికి లాంగ్‌మార్చ్ పేరు తో వచ్చేనెల 2వ తేదీన గుంటూరు జిల్లాలోని తాడేపల్లి నుంచి విజయవాడ ఒక ప్రదర్శన చేయనున్నారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉండటానికి, రాజధాని గా అమరావతి నే కొనసాగించడానికీ ఉద్దేశించిన మహా ప్రదర్శన ఇది. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత జనసేన పార్టీ తొలి సారిగా చేపట్టబోయే భారీ ప్రదర్శన కావడం తో పార్టీ దీన్ని ప్రతిష్ఠాత్మకం గా తీసుకుంది.

అయితే, ఇంత ప్రాధాన్యత ఉన్న లాంగ్‌ మార్చ్‌కు దూరంగా ఉండాలని రాపాక వరప్రసాద్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు ముందు నుంచీ తాను ఎలా దూరాన్ని పాటిస్తూ వస్తున్నారో, అదే వైఖరిని మరోసారి ప్రదర్శించాలని రాపాక భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు విశాఖపట్నం లో నిర్వహించిన లాంగ్‌ మార్చ్‌కు రాపాక హాజరయ్యారు. అప్పట్లో పార్టీ సొంతంగా ఈ భారీ ప్రదర్శనను నిర్వహించింది. కానీ , ఇప్పుడు బీజేపీతో పార్టీ పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీతో కలిసి లాంగ్‌ మార్చ్‌ను నిర్వహించాల్సి రావడం వల్లే రాపాక ఈ సారి గైర్హాజరు కావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ సారి జనసేన పార్టీ లో రాజకీయ పరిస్థితులు, వాతావరణం భిన్నంగా కనిపిస్తున్నాయని, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాషాయమయమైందని, అది ఇష్టం లేక పోవడం వల్లే ఈ సారి నిర్వహించబోయే లాంగ్‌మార్చ్‌ కు దూరంగా ఉండాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ లాబీల్లో కొందరు విలేకరుల వద్ద ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. చూడాలి మరి అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో ..