Begin typing your search above and press return to search.

పవన్ ఈ సీన్ చూస్తే తట్టుకోలేరు.!

By:  Tupaki Desk   |   22 Dec 2019 5:26 AM GMT
పవన్ ఈ సీన్ చూస్తే తట్టుకోలేరు.!
X
పొద్దున లేస్తే ఏపీ సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటారు జనసేనాని పవన్ కళ్యాణ్. ట్విట్టర్ లో సభల్లో సమావేశాల్లో వైసీపీ అధినేత టార్గెట్ గా విరుచుకుపడుతుంటారు. చంద్రబాబు తెరవెనుక దోస్తు వలే వ్యవహరిస్తున్నాడని ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే జనసేనాని ఇలా జగన్ ను బద్ధ శత్రువుగా భావిస్తుంటే.. ఆయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం పవన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ మధ్యే ఇంగ్లీష్ మీడియం చదువులను పవన్ వ్యతిరేకిస్తే అసెంబ్లీ సాక్షిగా జనసేన ఎమ్మెల్యే ఇంగ్లీష్ మీడియంకు మద్దతు తెలిపి పవన్ ను నవ్వుల పాలు చేశారు.

తాజాగా జగన్ బర్త్ డే సందర్భంగా పవన్ కు మరో గట్టి షాక్ తగిలింది. ఆయన వ్యతిరేకించే జగన్ పుట్టినరోజును జనసేన ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించడం పవన్ కు షాక్ లా మారింది.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరీ గ్రామంలో చేనేత వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే రాపాక.. జగన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫొటోకు పాలతో అభిషేకం చేయడం చర్చనీయాంశమైంది. పవన్ తీవ్రంగా వ్యతిరేకించే ఆయన శత్రువు జగన్ పైనే పాలు పోసిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం పవన్ ను ఇరుకునపెట్టింది. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నాయి. పవన్ కనుక ఈ సీన్ చూస్తే తట్టుకోలేరేమో అన్నట్టుగా ఈ ఫోటో ఉండడం గమనార్హం.