Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కు మళ్లీ షాకిచ్చిన రాపాక

By:  Tupaki Desk   |   8 Feb 2020 10:51 AM GMT
పవన్ కళ్యాణ్ కు మళ్లీ షాకిచ్చిన రాపాక
X
జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కానీ ఈయన గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వెళుతూనే ఉన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ ఆకాంక్షలను పక్కనపెట్టి అసెంబ్లీ సాక్షిగా జగన్ కు జైకొట్టారు.

తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరోసారి షాకిచ్చారు రాపాక వరప్రసాద్.. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కోసం రాజమండ్రికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రాపాక సన్నిహితంగా మెలగడం జనసేన నేతలకు పుండుమీద కారం చల్లినట్టైంది. జగన్ ను రిసీవ్ చేసుకోవడం.. మర్యాదలు చేయడం.. మొత్తం ప్రొగ్రాంలో రాపాక సీఎంతోనే తిరగడం తో జనసేన నేతలే కాదు.. వైసీపీ నేతలు కూడా ముక్కున వేలేసుకున్నారు.

ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్న రాపాక పై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు. దీని పై హైపవర్ కమిటీలోనూ చర్చించారు. రాపాకకు బహిరంగ లేఖ రాసి వార్నింగ్ ఇచ్చారు.

పవన్ ఇంత చేసినా కూడా మళ్లీ రాపాక.. జగన్ పర్యటనను అన్నీ తానై నిర్వహించడం చూసి జనసైనికులు షాక్ కు గురవుతున్నారు.