Begin typing your search above and press return to search.

పోర్స్బ్ ని ర‌ప్ఫాడించేసిన రంగోలి

By:  Tupaki Desk   |   20 Dec 2019 7:32 AM GMT
పోర్స్బ్ ని ర‌ప్ఫాడించేసిన రంగోలి
X
ప్ర‌ముఖ బిజినెస్ మ్యాగ‌జైన్ ఫోర్బ్స్ ప్ర‌తియేటా సెల‌బ్రిటీల ఆదాయాల వివ‌రాలు వెల్ల‌డిస్తోన్న సంగ‌తి తెలిసిందే. టాప్ 100 ఇండియ‌న్ సెల‌బ్రిటీల ఆదాయాల గురించి పోర్స్బ్ లెక్క‌లు తేలుస్తుంటుంది. తాజాగా 2018- 2019 (అక్టోబ‌ర్ టు సెప్టెంబ‌ర్) సీజన్ కి ఎవ‌రి ఆదాయం ఎంత? అన్న వివ‌రాల్ని ఇటీవ‌లే వెల్ల‌డించింది. సినిమాల పారితోషికం.. ప్ర‌క‌ట‌నల ఆదాయంతో ఎవ‌రు ఎంత సంపాదించార‌న్న‌ది అందులో ప్ర‌చురించింది. వాటిని అధారంగా చేసుకుని మిగ‌తా మీడియా సంస్థలు ఆ వివ‌రాల‌ను ప్ర‌చురించాయి. అయితే తాజాగా ఈ జాబితాపై బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ సోద‌రి రంగోళి పోర్స్బ్ ని ర‌ప్ఫాడించేసింది.

పోర్స్బ్ వెల్ల‌డించిన లెక్క‌ల‌న్ని త‌ప్పులు త‌డ‌క‌లు అని..అస‌లు ఎవ‌రు ఎంత సంపాదిస్తున్నారో? ఎలా లెక్క‌గ‌డుతున్నారంటూ! పోర్స్బ్ ని నిల‌దీసింది. అదోక ప్రాండ్ సంస్థ‌. మ్యాగ‌జైన్ పబ్లిసిటీ కోసం ఆడుతోన్న ఓ గేమ్ అది. పోర్స్బ్ చూపించిన లెక్క‌లు కంటే కంగ‌న ఎక్కువ ట్యాక్స్ క‌డుతుంది. అస‌లు కంగ‌న ఎంత సంపాదిస్తుందో త‌న‌కే తెలియ‌దు. ఆ వివ‌రాలు నాకు.. అకౌంట్స్ వాళ్ల‌కు మాత్ర‌మే తెలుసున‌ని తెలిపింది. ఎంతో గోప్య‌మైన‌ ఆ సీక్రెట్ మీకెలా తెలుసు? అస‌లు ఇంకా ఆర్ధిక సంవ‌త్సంరం కూడా ముగియ‌కుండా ఎలా లీక‌య్యాయి? అంటూ కోపోద్రిక్తురాలైంది.

అడ్వాన్స్ ట్యాక్స్ మాత్ర‌మే ఫైల్ అయింద‌ని..కానీ పోర్స్బ్ మాత్రం సెల‌బ్రిటీలు అంతా వాళ్ల‌ చుట్టాలు అన్న‌ట్లు.. గ‌ణాంకాల్ని ఫోన్ చేసి చెప్పిన‌ట్లు ఎలా రాస్తారు? అస‌లు ఆ పిచ్చి రాత‌లేమిటి అంటూ మండిప‌డింది. డియ‌ర్ పోర్బ్స్ మీ లెక్క‌లు నిజ‌మైతే ఇదే నా స‌వాల్. బ‌హిరంగంగా ఆధారాల‌తో చూపించండి.. నేను మీకు క్ష‌మాప‌ణ‌లు చెబుతా? లేదంటే మీరు నాకు సారీ చెప్పాలంటూ స‌వాల్ విసిరింది. మ‌రి రంగోళి వ్యాఖ్య‌ల‌పై పోర్స్బ్ యాజ‌మాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి. కంగ‌న ఈ ఏడాది పోర్స్బ్ జాబితో 70వ స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో రంగోలి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మీడియాలో హైలైట్ అవుతోంది. సిస్ట‌ర్స్ నోటిదురుసులో రికార్డులు బ్రేక్ చేస్తుండ‌డం సంచ‌ల‌నం అవుతోంది.