Begin typing your search above and press return to search.
రణధీర్ ఎపిసోడ్ లో భారీ తప్పు జరిగిందా?
By: Tupaki Desk | 2 Oct 2018 10:19 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాని పరిస్థితి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో విపక్షానికి చెందిన కొందరు నేతలపై అధికారపక్షం తమ పవర్ కత్తి దూస్తోందని.. కొందరు నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తోందన్న ఆరోణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
రేవంత్ ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు చేపట్టటం సృష్టించిన సంచలనం ఒక కొలిక్కి రాకముందే ఆయనకు సన్నిహితుడిగా చెప్పే రణధీర్ ని ఐటీ అధికారులంటూ ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేసి.. అదుపులోకి తీసుకెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. ఆదివారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పినా.. ఆయన్ను ఎవరు అదుపులోకి తీసుకున్నారో అర్థం కాని అయోమయం చోటు చేసుకుంది.
రణధీర్ ను ఎవరు అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై సోమవారం మొత్తం ఏ శాఖకు చెందిన అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. రణధీర్ ను ఎవరు తీసుకెళ్లారన్న దానిపై అయోమయం నెలకొన్న వేళ.. రేవంత్ రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫోన్ చేసిన రేవంత్.. గొడవ మీకు.. నాకు మధ్యన. మధ్యలో వాళ్లంతా ఏం చేశారు? రణధీర్ ను వెంటనే విడుదల చేయకుంటే.. హైకోర్టులో పిటిషన్ వేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో అర్థరాత్రి 11.30 గంటల వేళలో ఉప్పల్ పోలీసులు ఒక ప్రకటన చేశారు. రణధీర్ ను తామే అదుపులోకి తీసుకున్నట్లుగా వారు వెల్లడించారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వాహనాల్ని తనిఖీ చేసే సమయంలో ఒక బ్యాగుతో రణధీర్ రెడ్డి కనిపించాడని.. అనుమానాస్పదంగా ఉండటంతో స్టేషన్ కు తీసుకెళ్లి విచారించినట్లుగా చెప్పారు. ఆయన్ను విడిచిపెడుతున్నట్లు చెప్పారు.
ఆదివారం రాత్రి తీసుకెళ్లి.. కనీసం అధికారిక ప్రకటన చేయకుండా ఉండటం ఒక ఎత్తు అయితే.. సోదాలు ఆరోపణను పక్కన పెట్టేసి.. రోడ్డు మీద అనుమానాస్పదంగా కనిపించటంతో అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే రేవంత్ ఎపిసోడ్ లో విమర్శలు ఎక్కువ కావటం.. సానుభూతి పెరుగుతున్న వేళ.. రణధీర్ ఎపిసోడ్ కేసీఆర్ అండ్ కోకు ప్రతికూలంగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రణధీర్ ను ఐటీ అధికారులంటూ ఇంట్లో నుంచి తీసుకెళ్లిన దానికి సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా రణధీర్ వ్యవహారం మరింత సంచలనం కానుందని చెప్పక తప్పదు.