Begin typing your search above and press return to search.
రాందేవ్ బాబా ఈజ్ అవుట్ అఫ్ కంట్రోల్ !
By: Tupaki Desk | 24 May 2021 10:09 AM ISTప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా..అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కట్టడిలో ఆధునిక వైద్యం విఫలమైందని, అదో పనికిమాలిందంటూ రాందేవ్ నోరుజారిన విషయం తెలిసిందే. కరోనాకు అల్లోపతి వైద్య విధానం పని చేయకపోవడం వల్లే లక్షలాది మంది చనిపోతున్నారని ఇటీవల రాందేవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఈ వివాదంపై స్పందించిన రాందేవ్ సంస్థ పతంజలి.. అది ఎడిట్ చేసిన వీడియో అని పేర్కొంది. అంతేకాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ఔషధాలను వ్యతిరేకించే దుష్ట సంకల్పం తమది కాదని తెలిపింది. ఓ ప్రయివేట్ కార్యక్రమంలో తనకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌ను మాత్రమే రాందేవ్ చదివి వినిపించారు.. అవాస్తవానని ఆయన వ్యతిరేకించినట్టు ఆపాదించడం తప్పు అని పేర్కొంది.
అయితే, అయితే గత రెండు రోజులుగా రామ్ దేవ్ బాబా మాట్లాడిన మాటలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అల్లోపతి విధానాన్ని ఆయన విమర్శిస్తున్నారని, డాక్టర్లను, వైద్య సిబ్బందిని అవమానపరుస్తున్నారని, కించ పరుస్తున్నారని అనేకమంది ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనకు లీగల్ నోటీసును కూడా పంపింది. అటు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ కూడా బాబా రాందేవ్ కి లీగల్ నోటీసు పంపింది. అల్లోపతి ఒక కుంటి శాస్త్రం.. మొదట, హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది. ఇప్పుడు రెమ్ డెసివిర్, ఐవర్ మెక్టిన్, ప్లాస్మా థెరపీ విఫలమయ్యాయి. ఫాబిఫ్లు, స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటీబయాటిక్స్ కూడా విఫలమయ్యాయి అని బాబా రామ్ దేవ్ ఆరోపించారు. ఆక్సిజన్ కొరత కంటే అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది కరోనా వైరస్ రోగులు మరణించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సరికావు అని అన్నారు. కొన్ని లక్షల మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి, కంటి తుడుపు చర్యగా రామ్ దేవ్ ఇచ్చిన వివరణ కూడా ఎంతమాత్రం సరిపోదు అని అన్నారు. ఈ మేరకు రామ్ దేవ్ బాబాకి హర్షవర్థన్ లేఖ రాశారు. కరోనా కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని, ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయని, వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే, మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని.. అదొక, మూర్ఖపు విజ్ఙానం... తమాషా అంటూ రామ్ దేవ్ వ్యాఖ్యానించడం సబబు కాదని అన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న రాందేవ్ బాబా లాంటి వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదన్నారు. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. అలాగే, బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే , దేశంలో ఓ గొప్ప వ్యక్తిగా ఉన్న రాందేవ్ బాబా అలా ఎలా కంట్రోల్ తప్పి మాట్లాడతారు అంటూ నెటిజన్స్ ఏకేస్తున్నారు. దీనితో నలువైపుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో .. అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగా గురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అలాగే , ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు అయన ఓ ట్విట్ కూడా చేశారు.