Begin typing your search above and press return to search.
మోడీ , అమిత షా లపై కేసు నమోదు .. తప్పుడు వాగ్దానాలే కారణమా ?
By: Tupaki Desk | 4 Feb 2020 10:37 AM ISTభారతీయ జనతా పార్టీ ..ప్రస్తుతం దేశం లో ప్రధాన పార్టీగా పార్లమెంట్ లోని ఉభయ సభల్లో స్పష్టమైన మెజారిటీతో పాలన సాగిస్తుంది. అలాగే 2014 లో మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ..పలు సంచలన నిర్ణయాలని తీసుకుంది. అలాగే కొంచెం కొంచెం పార్టీ ఇమేజ్ పెంచుకుంటూ రెండోసారి స్పష్టమైన మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో ఎదురెళ్లే మరో జాతీయ పార్టీనే లేదు. కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి అంతగా ఏమీ బాగాలేదు.
ఇక తాజాగా బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దెస వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలుచేసేది లేదు అని ప్రకటించాయి. ఇలా రకరకాలైన సమస్యలతో దేశం అట్టుడికిపోతున్న సమయంలో ఒక న్యాయవాది బీజేపీ పార్టీ మోసం చేసిందంటూ కేసు పెట్టాడు. అప్పట్లో బీజేపీ ఇచ్చిన ఒక హామీని నిరవేర్చకుండా ప్రజలని మోసం చేసిందంటూ తన ఫిర్యాదులో తెలిపారు.
దేశంలో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ.. నల్లధనంపై ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో దాచబడ్డ నల్లధనాన్ని వెలికితీసి.. దేశంలోని ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ బీజేపీ గత ఐదేళ్ల పాలనలో ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీనిపై తరుచూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే వ్యవహారం పై జార్ఖండ్ లోని రాంచీ కోర్టులో హెచ్ కె సింగ్ అనే ఓ న్యాయవాది ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలపై సెక్షన్ 415,సెక్షన్ 420 కింద ఫిర్యాదు చేశారు.
హెచ్ కె సింగ్ ఫిర్యాదుపై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు లో హెచ్ కె సింగ్ మాట్లాడుతూ.. 2019లోక్‌సభ ఎన్నికల హామీల్లో సీఏఏ కూడా ఒకటని అమిత్ షా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు దాన్ని అమలుచేయబోతున్నామని అంటున్నారు అని కోర్టుకు తెలిపారు. అయితే సీఏఏ ఎన్నికల హామీ అని, అందుకే దాన్ని అమలుచేస్తున్నామని చెబుతున్న కేంద్రం, అప్పట్లో ఇచ్చిన రూ.15లక్షల ఎన్నికల హామీని ఎందుకు అమలుచేయలేదు అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేయవద్దని ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతోందని హెచ్ కె సింగ్ వాదించారు. అయితే, దీనిపై అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదు అని కోర్టు అడగ్గా బీజేపీ ఇచ్చిన రూ.15లక్షల హామీకి మిగతా ప్రజల్లాగే తాను కూడా మోసపోయానని హెచ్ కె సింగ్ అన్నారు. వాళ్లకు ద్వంద్వ ప్రమాణాలు ఉండరాదన్నారు. సీఏఏ పై తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నప్పుడు. రూ.15లక్షల హామీని మాత్రం ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నించారు.