Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత...కారణం ఇదే !
By: Tupaki Desk | 19 May 2020 4:00 PM ISTభారతదేశంలో మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. తాజాగా ఈ మహమ్మారి సెగ ..కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కార్యాలయాన్ని తాకింది.సెంట్రల్ ఢిల్లీలోని కృషి భవన్‌లో ఆయన ఆధ్వర్యంలోని ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మత్స్య, పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ఈ మహమ్మారి పాజిటివ్ గా తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం మే 19, 20 తేదీల్లో కార్యాలయాన్ని మూసివేయనున్నట్టుగా తెలిపారు.
కాగా, ప్రస్తుతం రాంవిలాస్ పాశ్వాన్ ఆధ్వర్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలు ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 28న ఓ ఉద్యోగికి మహమ్మారి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నీతి ఆయోగ్ కార్యాలయాన్ని మూసివేసి.. శానిటైజన్ ప్రక్రియ చేపట్టారు. మే 5న న్యాయశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కరోనా సోకడంతో శాస్త్రి భవన్ బిల్డింగ్ లోని ఒక ఫ్లోర్ ను మూసివేశారు.