Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎమ్మెల్యేతో రూ.30 కోట్ల బేరం?

By:  Tupaki Desk   |   5 Nov 2017 11:16 AM IST
జ‌గ‌న్ ఎమ్మెల్యేతో రూ.30 కోట్ల బేరం?
X
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అస్త్రాన్ని మ‌రోసారి బ‌య‌ట‌కు తీశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. మ‌రో రోజు (సోమ‌వారం) వ్య‌వ‌ధిలో సుదీర్ఘ పాద‌యాత్ర‌కు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెర తీస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు షాకుల మీద షాకులు ఇవ్వాల‌ని ఏపీ అధికార‌పక్షం డిసైడ్ అయిన‌ట్లుగా చెప్పొచ్చు.

పార్టీని వీడే వారిపై ఒత్తిళ్లు పెంచ‌టం.. భారీగా ముట్ట‌జెప్ప‌టం ద్వారా విప‌క్ష నేత‌ను దెబ్బ కొట్టాల‌న్న ప్ర‌య‌త్నాల్ని చేస్తున్నారు చంద్ర‌బాబు. తాజాగా రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే.. జ‌గ‌న్ పార్టీ నేత వంతుల రాజేశ్వ‌రి పార్టీ మారారు. గ‌డిచిన కొద్దికాలంగా ఆమె పార్టీ మార‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌కు రూ.20కోట్లు ఇస్తామ‌ని అధికార‌ప‌క్షం నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన విష‌యాన్ని కొద్దిరోజుల క్రితంఆమె మీడియాతో చెప్పారు. తాజాగా ఆమె పార్టీ మార‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. అధికార పార్టీతో రూ.30 కోట్ల మేర బేరం కుదుర్చుకున్న నేప‌థ్యంలో పార్టీ మారిన‌ట్లుగా ఏపీ విప‌క్షం ఆరోపిస్తోంది.

జ‌గన్ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ఆ త‌ర్వాత జంప్ అయిన ఒక ముఖ్య నేతే.. రాజేశ్వ‌రి పార్టీ మార‌టానికి తెర వెనుక క‌థ న‌డిపించిన‌ట్లుగా చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీ మారిన రాజేశ్వ‌రి త‌న‌కు అందిన కోట్ల (?) ముచ్చ‌ట‌ను వ‌దిలేసి.. అభివృద్ధి కోస‌మే తాను పార్టీ మారిన‌ట్లుగా చెప్పారు.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి సంబంధించి చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చార‌ని.. ఈ కార‌ణంతోనే తాను పార్టీ మారిన‌ట్లుగా ఆమె చెబుతున్నారు. రాజేశ్వ‌రి మాట ప్ర‌కారం చూస్తే.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం విప‌క్ష నేత‌లంతా పార్టీ మారాల్సిందేనా? ఇదే ప‌రిస్థితి అంత‌టా ఉంటే.. ఇక విప‌క్షం అన్న‌ది ఉండ‌దే!