Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ పెళ్లికి బారులు తీరిన తెలుగు త‌మ్ముళ్లు

By:  Tupaki Desk   |   15 Jun 2017 4:43 AM GMT
ఆ ఎంపీ పెళ్లికి బారులు తీరిన తెలుగు త‌మ్ముళ్లు
X
యువ టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పెళ్లి వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వివాహ మ‌హోత్స‌వానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యులు మొత్తం హాజ‌ర‌య్యారు. రామ్మోహ‌న్ నాయుడు తండ్రి.. దివంగ‌త ఎర్రం నాయుడు బాబుకు చాలా స‌న్నిహితంగా ఉండేవారు. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల‌కు కీల‌కంగా నిలిచే ఎర్రం నాయుడు మృతిపై చంద్ర‌బాబు అప్ప‌ట్లో తెగ క‌ల‌త చెందేవారు. ఆ ఇంట జ‌రుగుతున్న పెళ్లి వేడుక‌కు.. బాబు ఫ్యామిలీ మొత్తంగా హాజ‌రైంది.

స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి.. కొడుకు లోకేశ్‌.. కోడ‌లు బ్రాహ్మ‌ణి.. మ‌న‌మ‌డితో స‌హా హాజ‌రైన చంద్ర‌బాబు వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ పెళ్లికి మ‌రో విశేషం ఏమిటంటే.. మ‌రో టీడీపీ ఎమ్మెల్యే బండారు స‌త్యానారాయ‌ణ మూర్తి కుమార్తె పెళ్లి కూతురు కావ‌టంతో ఈ పెళ్లికి తెలుగు త‌మ్ముళ్లు క్యూ క‌ట్టారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో జ‌రిగిన పెళ్లి వేడుక‌కు.. ప‌లువురు ప్ర‌ముఖులు భారీగా హాజ‌ర‌య్యారు.

రామ్మోహ‌న్ నాయుడు పెళ్లి వేడుక‌కు కేంద్ర‌మంత్రులు వెంక‌య్య‌నాయుడు.. అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. సురేశ్ ప్ర‌భులు హాజ‌ర‌య్యారు. ఇక‌.. రాష్ట్ర మంత్రుల్లో అచ్చెన్నాయుడు.. చిన‌రాజ‌ప్ప‌.. క‌ళా వెంక‌ట్రావు.. కేఎస్ జ‌వ‌హార్‌.. దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ప‌రిటాల సునీత‌.. గంటా శ్రీనివాస‌రావు.. న‌క్కా ఆనంద్ బాబు.. కొల్లు ర‌వీంద్ర‌.. సుజ‌య కృష్ణ రంగారావు.. ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ హాజ‌ర‌య్యారు.

మండ‌లి ఛైర్మ‌న్ చ‌క్ర‌పాణి.. ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌.. ముత్తం శెట్టి శ్రీనివాస‌రావు.. కేశినేని నానిల‌తో పాటు మాజీఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు.. విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్‌..మాజీ మంత్రి పీత‌ల సుజాత‌.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు ప‌లువురు హాజ‌ర‌య్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/