Begin typing your search above and press return to search.
అజాద్.. సిబల్ కు భారీ ఆఫర్ ఇచ్చిన కేంద్రమంత్రి!
By: Tupaki Desk | 2 Sept 2020 1:00 PM ISTలేఖాస్త్రాన్ని సంధించటం ద్వారా గాంధీ కుటుంబంలోని యువరాజు మీద యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ అజాద్.. కపిల్ సిబల్ కు తాజాగా బంపర్ ఆఫర్ లభించింది. ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే బాగుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు బీజేపీ తో లాలూచీ పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేయాలన్నారు.
భవిష్యత్తులో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని.. ఈ విషయాల్ని ఈ ఇద్దరు నేతలు గుర్తించాలన్నారు. దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీగా బీజేపీ అవతరించిందన్న ఆయన.. ఈ ఇద్దరు సీనియర్లు తమ పార్టీలోకి రావటమే మంచి పనిగా అభివర్ణించారు. కాంగ్రెస్ ను బలపరిచేందుకు ఎన్నో ఏళ్లుగా ఈ ఇద్దరునేతలు పని చేశారని.. అయినప్పటికీ వారికి ఆ పార్టీలో ఇప్పటికి సరైన గౌరవం దక్కలేదన్నారు. అందుకే.. తమ పార్టీలోకి రావాలన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పలువురు బీజేపీలోకి వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో యాక్టివ్ గా పని చేసిన జ్యోతిరాదిత్య సింథియా పార్టీని వదిలి తమ పార్టీలోనే చేరారని.. సచిన్ పైలెట్ సైతం పార్టీ వీడారని.. అంతలోనే రాజీ కుదరటంతో మళ్లీ వెనక్కి వెళ్లారన్నారు. రాబోయే రోజుల్లో చాలామంది నేతలు పార్టీని విడిచిపెట్టి.. తమపార్టీలోకి రానున్నారని.. అందుకే ముందే ఇద్దరు నేతలు రావాలన్నారు. అంతా బాగుంది కానీ.. మోడీషాల అనుమతితోనే కేంద్రమంత్రి ఈ మాటలన్ని మాట్లాడుతున్నారా? అదే నిజమైతే.. బీజేపీ లోని సీనియర్లు అద్వానీ..మురళీమనోహర్ జోషి లాంటోళ్ల కు ఏం గౌరవం దక్కినట్లు? ఏ పదవులు లభించినట్లు?