Begin typing your search above and press return to search.

టీమిండియా సెలక్షన్లలో రిజర్వేషన్లు పాటించాలట

By:  Tupaki Desk   |   2 July 2017 7:49 AM GMT
టీమిండియా సెలక్షన్లలో రిజర్వేషన్లు పాటించాలట
X
రాందాస్ అథావాలే... రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) వ్యవస్థాపక నేత - అంబేద్కర్ సిద్దాంతాలు ఫాలో అయ్యే నేతగా దేశ రాజకీయాల్లో బాగా పాపులర్. అంతేకాదు.. సామాజిక న్యాయ శాఖకు కేంద్రంలో ఆయన సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. దళితుల ప్రయోజనాలు, రిజర్వేషన్ల విషయంలో తరచూ బలమైన వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. చాంపియన్సు ట్రోఫీ ఫైనళ్లో ఇండియా టీం ఫిక్సింగ్ కు పాల్పడిందని సంచలన ఆరోపణ చేసిన ఆయన క్రికెట్ కు సంబంధించి మరో సంచలన వ్యాఖ్య చేశారు. టీమిండియా సెలక్షన్లలో రిజర్లేషన్లు పాటించాలని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు విద్యాఉద్యోగాలకే పరిమితమైన రిజర్వేషన్లు క్రికెట్ టీంలో కూడా అమలు చేయాలని అథవాలే డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకే భారత క్రికెట్‌ టీంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. భారత క్రికెట్‌ టీంలో ఎస్సీ,ఎస్టీలకు కనీసం 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

గతంలోనూ ఆయన పలు అంశాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఎలా ఉన్నా క్రికెట్లో రిజర్వేషన్లు అనేసరికి ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలకు ఎక్కడలేని ప్రాధాన్యం దక్కింది. మరి అథవాలే వ్యాఖ్యలను క్రీడాలోకం, ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/