Begin typing your search above and press return to search.

టిక్ టాక్ బ్యాన్: మోడీకి కేంద్రమంత్రుల డిమాండ్

By:  Tupaki Desk   |   20 Jun 2020 11:50 AM GMT
టిక్ టాక్ బ్యాన్: మోడీకి కేంద్రమంత్రుల డిమాండ్
X
20 మంది భారతీయ సైనికులను చంపిన చైనా దేశంపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు భారతీయులు. చైనా వస్తువులను , యాప్ లను బహిష్కరిస్తున్నారు. ఇదో పెద్ద క్యాంపెయిన్ లా సాగుతోంది. కేంద్రమంత్రులు కూడా ఇప్పటికే చైనా ఉత్పత్తులను వాడకూడదని పిలుపునిచ్చారు.

భారత్-చైనా సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రధాని మోడీ ఇటీవలే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భేటిలో పాల్గొన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు, నేతలు టిక్ టాక్ వంటి యాప్ లను , చైనా ఉత్పత్తులను దేశం నుంచి నిషేధించాలని ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్థించారు.

ఇక తాజాగా భేటిలో చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా యాప్ టిక్ టాక్ ను నిషేధించాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. టిక్ టాక్ ను దాదాపు 15 మిలియన్ల భారతీయులు వాడుతున్నారని. దీని ద్వారా చైనా కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నట్టు తెలిపి ఈ యాప్ ను నిషేధించాలని ప్రధాని మోడీని కోరారు. రాందాస్ తోపాటు కొందరు మంత్రులు కూడా టిక్ టాక్ బ్యాన్ చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఆఖరకు కేంద్ర మంత్రులు కూడా చైనాపై ఆగ్రహంతో రగిలిపోతున్న నేపథ్యంలో చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి భారత్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే 5జీ కాంట్రాక్టు నుంచి చైనా కంపెనీలను కేంద్రం తొలగించింది. దీంతో ఇప్పుడు మోడీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.