Begin typing your search above and press return to search.
మంత్రిని చంపిన వ్యక్తిని చేర్చుకుంటావా బాబు
By: Tupaki Desk | 22 Feb 2016 3:35 PM GMTజమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పడేస్తోంది. ఆదినారాయణ రెడ్డి చేరికను మొదటినుంచి వ్యతిరేకిస్తున్న జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కళా వెంకటరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో రామసుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. వైకాపా నుంచి చేరికల వల్ల పార్టీలో రామసుబ్బారెడ్డి ప్రాముఖ్యతకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని కళావెంకటరావు వారికి నచ్చచెప్పారు.
మరోవైపు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కలవడానికి విజయవాడకు వచ్చిన సందర్భంగా రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పెదనాన్నను ఆదినారాయణరెడ్డి చంపారని ఆవేదనతో చెప్పారు. ఆయన టీడీపీలో చేరే విషయంలో కార్యకర్తల మనోభావాలను చంద్రబాబుకు వివరిస్తామని తెలిపారు. తుది శ్వాస విడిచే వరకు చంద్రబాబుతోనే ఉంటామని రామసుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ మంత్రి శివారెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త శివారెడ్డిని, కొడుకును ఆదినారాయణ రెడ్డి మనుషులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కార్యకర్తలను వెంటాడి వేధించారని దీంతో ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతిన్నామని వాపోయారు. ఈ విషయాలన్నీ పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిసినప్పటికీ మరోమారు అన్ని విషయాలు చెబుతామన్నారు. ఆదినారాయణరెడ్డితో కలవడం కష్టమేనని అయితే పార్టీ కోసం తప్పదని లక్ష్మీదేవమ్మ చెప్పారు.