Begin typing your search above and press return to search.

అయోధ్య లో రామ మందిర్ ట్రస్ట్ నిధులు 'స్వాహా'!

By:  Tupaki Desk   |   10 Sept 2020 4:40 PM IST
అయోధ్య లో రామ మందిర్ ట్రస్ట్ నిధులు స్వాహా!
X
అయోధ్య లో రామ మందిర్ ట్రస్ట్ కి సంబంధించిన లక్షల నిధులను ఎవరో వ్యక్తులు మోసం చేసి రెండు బ్యాంకు అకౌంట్ల నుంచి విత్ డ్రా చేశారు. ఫోర్జరీ చేసిన చెక్కులను వినియోగించి వారీ మోసానికి పాల్పడ్డారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కి వెల్లడించారు. మూడో సారి కూడా ఆ కేటుగాళ్లు ఇలా అక్రమంగా దేవుడి సొమ్మును దోచేయాలని చూడగా అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ అడ్డుపడింది. దీనిపై చంపత్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ట్రస్ట్ సభ్యులు బ్యాంకుల్లో తాము రామ మందిర్ పేరిట డిపాజిట్ చేసిన సొమ్ము పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటనతో అర్థమైంది.

రామ్ జన్మభూమి స్థలంలో 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రాబోతున్న ఈ గొప్ప ఆలయాన్ని నిర్మించ‌డానికి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ , టౌబ్రో సిద్ధం గా ఉంది. ఈ సంస్థ ఎటువంటి రుసుము వసూలు చేయకుండా నిర్మాణాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ఆలయ పునాది కోసం సుమారు 1,200 స్తంభాలను 100 అడుగుల లోతులో వేస్తారు. ఈ స్తంభాలు రాతితో మాత్రమే ఉంటాయి.. వీటిలో ఇనుమును ఉపయోగించరు. ఆ తరువాత ఈ స్తంభాలపై, మరొక పొర పునాదిని వేస్తారు. ఇక లార్సెన్ , టౌబ్రో నిర్మాణ సంస్థ ముంబై, హైదరాబాద్ నుండి అవసరమైన యంత్రాలను తరలించే పనిలో ఉంది. ఈ వారం అయోధ్య డెవలప్‌ మెంట్ అథారిటీ రెండు లేఅవుట్లను ఆమోదించింది. అందులో ఒకటి మందిరం నిర్మాణానికి సంబంధించింది కాగా మరొకటి మొత్తం రామ జన్మభూమి క్యాంపస్‌ లే అవుట్‌. ఎంపిక చేసిన లే ఔట్లను సెప్టెంబర్ 4 న ట్రస్ట్‌కు అప్పగించింది. ట్రస్ట్ వెల్లడించిన దాని ప్రకారం, ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఆలయ నిర్మాణానికి పునాది వేస్తారు..తద్వారా 1,000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఆలయం ఉంటుందని చంపత్ రాయ్ అన్నారు. కాగా గత నెలలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి పునాది వేసిన సంగతి తెలిసిందే.