Begin typing your search above and press return to search.

అమ్మవారికి కాంగ్రెస్ నేత అల్టిమేటం..

By:  Tupaki Desk   |   29 Oct 2018 5:44 PM IST
అమ్మవారికి కాంగ్రెస్ నేత అల్టిమేటం..
X
ఎన్నికల వేళ అందరూ ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని మథన పడుతున్నారు. వారికి ఏ ఏ హామీలివ్వాలని.. ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలోనని ఊరువాడ, గల్లీ గల్లీ తిరుగుతూ ప్రాధేయపడుతున్నారు. కానీ సూర్యపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం ఆ పనిచేయకుండా అమ్మవారికి చండీయాగం చేస్తూ కోరికలు కోరుతున్నాడు.

సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తాజాగా తాను ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయ సాధించాలని సీఎం పదవి లేదా మంత్రి పదవి దక్కేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఓ లేఖ రాసి అమ్మవారి పాదాల కింద పెట్టారు. యాగం చేస్తూ ఆ పత్రంపై పూలు, పసుపు, కుంకుమ వేస్తూ తన కోరికను అమ్మవారి ముందుంచుతున్నారు. ఇలా పదవి కోసం చండీయాగం చేస్తున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక యాగం చేస్తే.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం గెలుపు కోసం సీఎం, లేదా మంత్రి పదవి ఆశిస్తూ చండీయాగం నిర్వహించడం గమనార్హం. ముందస్తు ఎన్నికల వేళ అందరూ ప్రజల వద్దకు వెళుతూ ప్రచారంలో దూసుకుపోతుంటే ఈయన మాత్రం యాగాలు చేస్తూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నాడు. చూడాలి మరి ఈయన ఆశలను అమ్మవారు నెరవేరుస్తుందో లేదో..