Begin typing your search above and press return to search.

రామ్‌ నాథ్ నాలుగో నామినేష‌న్ వేసేది ఎప్పుడు?

By:  Tupaki Desk   |   24 Jun 2017 6:18 AM GMT
రామ్‌ నాథ్ నాలుగో నామినేష‌న్ వేసేది ఎప్పుడు?
X
ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేష‌న్ల వ్య‌వ‌హారంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. మొద‌టి నుంచి ప్ర‌చారం జ‌రిగిన‌ట్లుగా రామ్ నాథ్ నాలుగు సెట్ల నామినేష‌న్ల‌ను వేయ‌కుండా.. మూడు మాత్ర‌మే వేశారు. ముందుగా నిర్ణ‌యించిన‌ట్లే.. సంత‌కాలు మాత్రం ప్ర‌ధాని మోడీ .. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. పార్టీ అధినేత అమిత్ షా.. పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్‌.. కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ త‌దిత‌రులు సంత‌కాలు పెట్టారు. ముందుగా అనుకున్న‌ట్లు నాలుగు నామినేష‌న్లు కాకుండా మూడింటితోనే శుక్ర‌వారం కార్య‌క్ర‌మాన్ని ముగించారు.

మ‌రి.. నాలుగో నామినేష‌న్ సెట్ సంగ‌తి ఏమిట‌న్న ప్ర‌శ్న‌లోకి వెళితే.. ఈ నెల 28న నాలుగో నామినేష‌న్‌ ను దాఖ‌లు చేయ‌నున్నారు. ప్ర‌ధాని మోడీ మూడు దేశాల విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండే నేప‌థ్యంలో.. నాలుగో నామినేష‌న్ సెట్‌ ను కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు నేతృత్వంలో వేస్తార‌ని చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. శుక్ర‌వారం ఏ రీతిలో అయితే ధూంధాంగా రామ్ నాథ్ నామినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగిందో.. అదే రీతిలో ఈ నెల 28న వేసే నాలుగో నామినేష‌న్ సెట్ దాఖ‌లు స‌మ‌యంలోనూ అంతే వేడుక‌గా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ రోజున‌.. శుక్ర‌వారం మాదిరే స్వ‌ప‌క్షం.. మిత్ర‌ప‌క్షం.. కొత్త మిత్రులంతా క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు.

ఇదిలా ఉంటే.. నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప‌లువురు ఎన్డీయే నేత‌ల‌తో క‌లివిడిగా మాట్లాడ‌టం క‌నిపించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్‌ తోనూ కేసీఆర్ ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. రామ్ నాథ్ అందుకు సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/