Begin typing your search above and press return to search.
ప్రధాని చేతుల మీదుగా రామమందిరానికి శంకుస్థాపన ?
By: Tupaki Desk | 18 July 2020 11:20 PM ISTఅయోధ్య రామమందిరం గురించి ఒక కీలక్ అప్ డేట్ వైరల్ అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ దేవాలయానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెంపుల్ ప్లాన్ కూడా సిద్ధమైంది. త్వరలో హిందువులకు చిహ్నంగా భావించే అయోధ్య రాముడికి ఆలయ నిర్మాణం ప్రారంభం కానుంది. దేశంలోనే అత్యంత కీలక ఘట్టం కావడంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా... భూమి పూజ కార్యక్రమం ప్రధాని మోడీ చేతుల మీద జరపడానికి రామమందిరం ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. ముహుర్తం కోసం ఆగస్టు 3 - 5 తేదీలను పీఎంవోకు పంపించింది. ఆ రెండు మంచి ముహర్తాలే. ప్రధాని షెడ్యూల్ ప్రకారం ఏదో ఒక తేదీని ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉండగా... ఆలయ రూపకల్పన పూర్తి కావడానికి మూడు, మూడున్నర సంవత్సరాలు పడుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామ్ టెంపుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం కోసం దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలయ ఎత్తు 161 అడుగులు, ఐదు గోపురాలు ఉంటుందని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు.
ప్రస్తుతం భూమిని చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా ప్రధానితో పాటు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నారు. వాస్తవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను పిలవాలనుకున్నారు. కోవిడ్ కారణంగా ముఖ్యులను పరిమిత సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు.