Begin typing your search above and press return to search.

ఇద్దరు తమ్ముళ్లు.. మధ్యలో ములాయం

By:  Tupaki Desk   |   17 Oct 2016 9:42 AM GMT
ఇద్దరు తమ్ముళ్లు.. మధ్యలో ములాయం
X
యూపీలో అన్నాదమ్ముల మధ్య రచ్చ వీదికెక్కింది! ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం కు ఆయన కుమారుడు యూపీ సీఎం అఖిలేష్ కు మధ్య గేప్ ఉందని.. దానికి కారణం ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ అనేది తెలిసిన విషయమే! అయితే ఈ విషయంలో తాజాగా ములాయం కూడా వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి అఖిలేష్ కాదని, ఎవరు అనేది కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ములాయం మరో తమ్ముడు - సమాజ్ వాదీ పార్టీలోని కీలక నేత రాంగోపల్ యాదవ్ తాజాగా తన పెద్దన్నయ్య ములాయం కు ఒక లేఖ రాశారు.

వచ్చే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కనీసం 100సీట్లు కూడా గెలుచుకోలేకపోతే దానికి ములాయం నే బాధ్యుడని లేఖలో పేర్కొన్న రాంగోపాల్... "యూపీని అద్భుతంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న కుమారుడు అఖిలేష్ ని కాదని నీకు ప్రీతిపాత్రుడైన తమ్ముణ్ని వెనకేసుకొస్తున్నావు.. నువ్వు చరిత్రను ఒక్కసారైనా పరికించావా? చరిత్ర చాలా క్రూరమైనది అన్నాయా.. అది ఏ ఒక్కరినీ క్షమించదు" అంటూ ఈ లేఖలో ములాయం - శివపాల్ కు మద్దతిస్తోన్న విషయంపై స్పందించారు. 2017 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సీఎం అభ్యర్థి కాబోడంటూ ఇటీవల ములాయం చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ తీవ్రంగా స్పందింస్తూ ఈ ఘాటైన లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో కూడా అఖిలేష్ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే దారుణమైన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని రాంగోపాల్ ఈ సందర్భంగా లేఖలో అభిప్రాయపడ్డారు.

అయితే పెద్దన్నయ్యగా ఉన్న ములాయం ఒక తమ్ముడు శివపాల్ యాదవ్ కు పూర్తిగా మద్దతిస్తోండగా, ఆ విషయంతో పాటు శివపాల్ ని మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్నారు రాంగోపాల్ యాదవ్! ప్రస్తుతం అఖిలేష్ టీంలో ప్రధాన వ్యూహకర్త గా ఉన్న రాంగోపాలే ఏనాడూ తన పెద్దన్న ములాయంను నేరుగా విమర్శించలేదు. కాగా... వచ్చే ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే విషయం కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారంటూ ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన తరుణంలో... 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ మళ్లీ విజయం సాధిస్తే అఖిలేష్ ముఖ్యమంత్రి అవుతారని, ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ పేరునే తాను ప్రతిపాదిస్తానని శివపాల్ సింగ్ యాదవ్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/