Begin typing your search above and press return to search.
రజనీ ప్రధాని అయితే భారత్ మరో అమెరికా!
By: Tupaki Desk | 6 Feb 2018 11:12 PM IST`వీడి చర్యలు ఊహాతీతం వర్మ.....దట్స్ ద బ్యూటీ....`ఇది ఇటీవల విడుదలైన ఓ టాలీవుడ్ సినిమాలో పాపులర్ డైలాగ్. ఈ డైలాగ్ అచ్చుగుద్దినట్లుగా....వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సరిపోతుంది. ఎవరి చర్యలు ఊహాతీతంగా ఉంటాయో ఆయనే వర్మ! ఎందుకంటే....వర్మ....ఎప్పుడు ఏ అంశం మీద....ఎవరిపై....ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో బహుశా ఆయనకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. కానీ - వర్మ మస్తిష్కంలోకి ఓ ఆలోచన వచ్చిందంటే చాలు....అది సోషల్ మీడియాలోనో...మీడియాలో ప్రత్యక్షమవుతుంది. కొద్ది రోజుల క్రితం వర్మ విసిరిన బ్రహ్మాస్త్రం జీఎస్టీ (గాడ్.. సెక్స్.. అండ్ ట్రూత్) పై విపరీతమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ హడావిడి సద్దుమణుగుతుందనుకునే లోపు వర్మ తన `ట్వీటు`కు పనిచెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తలైవా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై రకరకాల విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, వర్మ....రజనీ అభిమానులు ఫిదా అయ్యే కామెంట్ చేశారు. రజనీ... ప్రధానమంత్రి అయితే భారత్.. అమెరికా స్థాయికి చేరుకుంటుందంటూ తాజాగా వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లో భారత్ కూడా ఒక దేశం అని, అదే రజనీ కాంత్ ప్రధాని అయితే ఇండియా కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుందని వర్మ ట్వీట్ చేశారు. 2.జీరో నుంచి 200.జీరోకు చేరుతుందంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. దాంతో పాటు కొద్దిగా వైరాగ్యంతో కూడిన మరో ట్వీట్ చేశారు. పెళ్లి, చావు ఒకటేనంటూ నెటిజన్లకు వర్మ హితబోధ చేశారు. వివాహం, అంత్యక్రియలు తనకు ఇష్టం ఉండవని, ఒకటి స్వేచ్ఛను కోల్పోయేందుకు చేస్తే, మరొకటి దేహం చనిపోయినందుకు చేస్తారని వేదాంతం వల్లించారు. గతంలో పవన్‌కల్యాణ్ రాజకీయ జీవితం పై, రజనీ కాంత్ రాజకీయ అరంగేట్రంపై....ఆ ఇద్దరు హీరోలను పోలుస్తూ.....వర్మ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.