Begin typing your search above and press return to search.

వర్మకే భయం టేస్ట్ చూపించాడా?

By:  Tupaki Desk   |   23 Aug 2016 6:43 AM GMT
వర్మకే భయం టేస్ట్ చూపించాడా?
X
తన కామెంట్లతో అగ్గి పుట్టించే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విషయం ఏదైనా.. సంబంధం ఉన్నా లేకున్నా తనదైన శైలిలో స్పందించి.. మాటలతో మంటలు పుట్టించే తత్వం వర్మ సొంతం. అలాంటి వర్మలోమరో గుణం కూడా ఉంది. ముఖం పగిలిపోయేలా తన అభిప్రాయాన్ని వెల్లడించటం.. మెజార్టీ అభిప్రాయానికి భిన్నంగా తన వాదనను తెర మీదకు తీసుకురావటం. కొన్ని సందర్భాల్లో నిజం ఒకటైనా.. ప్రజల సెంటిమెంట్లు దెబ్బ తింటాయన్న భావనతో చాలామంది నిజాలు మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. ఇక.. సెలబ్రిటీలు అయితే వివాదాలకు కిలోమీటర్ల దూరంలో ఉంటారు.కానీ.. వర్మ మాత్రం అందుకు భిన్నం. ఆయన వివాదాలతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు.

అలాంటి వర్మకు డేర్ డెవిల్ గా పలువురు అభివర్ణిస్తారు. అందుకే.. వర్మ ఎవరికి భయపడడా? అని పలువురు ప్రశ్నిస్తుంటారు. తన బోల్డ్ వ్యాఖ్యలతో ఎవరితోనైనా తగువు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండే వర్మలో మొండితనం ఎక్కువే. అలాంటి వ్యక్తి సైతం ఒళ్లు గగుర్పాటుకు గురి చేసి.. భయపడేలా నయిం ఉదంతం చేసిందని చెప్పుకొచ్చారు. నయిం ఎన్ కౌంటర్ తర్వాత బయటకు వస్తున్న సమాచారం నేపథ్యంలో.. తనకున్న సోర్స్ తో అతడికి సంబంధించిన సమాచారాన్ని తాను సేకరిస్తున్న విషయాన్ని వెల్లడించిన వర్మ.. నయిం కథను ఒక్క సినిమాలో చూపించటం కష్టమని తేల్శాడు.

నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మార్ గా రూపాంతరం చెందటం.. ఆ తర్వాత అండర్ వరల్డ్ డాన్ గా అవతారం ఎత్తటం.. అతడి క్రిమినల్ వ్యవహారాలు భయపెట్టేవిగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. చివరగా నయిం జీవితాన్ని మూడు భాగాల్లో తాను తెరకెక్కించున్నట్లుగా వెల్లడించాడు. రక్తచరిత్ర రెండు భాగాలే అని.. నయిం మీద తాను తీసే సినిమా మాత్రం మూడు భాగాల్లో ఉంటుందని వెల్లడించాడు. పోలీసుల విచారణలో బయటకు రాని ఎన్ని నిజాలు వర్మ తన సినిమాలో చూపిస్తాడో చూడాలి.