Begin typing your search above and press return to search.
రజనీతో పోలిక పెట్టి..పవన్ ను వర్మ ఆడుకున్నారే!
By: Tupaki Desk | 3 Jan 2018 10:39 AM ISTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ తెరంగేట్రంపై ప్రకటన చేసిన రెండు రోజులకు ట్విట్టర్ వేదికగా తిరిగీ రీ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ... వచ్చీ రావడంతోనే పవన్ కల్యాణ్ పై నిజంగానే పేట్రేగిపోయారనే చెప్పాలి. తూటాల్లాంటి కామెంట్లను సంధించిన వర్మ... అసలు పవన్‌కు ఉన్న దమ్మెంత? అనేలా వరుస ట్వీట్లు సంధించారు. తమిళ ప్రజల సూపర్ స్టార్‌గా రజనీని అభివర్ణించిన వర్మ.... పవన్‌ను తెలుగు ప్రజల సూపర్ స్టార్ గా పేర్కొన్నారు. మరి ఈ ఇద్దరి సూపర్ స్టార్ల సత్తా ఏమిటన్న విషయంపై కామెంట్లు చేసిన వర్మ... పవన్ ను తెలుగు ప్రజలతో పాటు ఫ్యాన్స్ కూడా ఎలా అర్థం చేసుకుంటారన్న విషయాన్ని ప్రస్తావించి సంచలనమే రేపారని చెప్పాలి. తాజా ట్వీట్లకు కొన్ని గంటల ముందుగా తెలంగాణ సీఎంతో పవన్ కల్యాణ్ భేటీ అయిన వైనాన్ని ప్రస్తావించిన వర్మ... తనదైన శైలిలో టైమ్లీ సెటైర్లు సంధించారు. ఆ తర్వాత ఓ మూడు గంటల విరామం ఇచ్చిన వర్మ... ఈ దఫా పవన్ సత్తాను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు సంధించారు. ఈ ట్వీట్లన్నింటిలో పవన్ ను రజనీకాంత్ తో పోల్చిన వర్మ... అసలు పవన్... సూపర్ స్టార్ అనిపించుకుంటారా? లేదంటే ఆర్డినరీ స్టార్ అనిపించుకుంటారా? అని నేరుగానే తూటాల్లాంటి మాటలను పేల్చేశారు.
అసలు పవన్ ను వర్మ... రజనీతో ఎందుకు పోల్చారన్న విషయానికి వస్తే... మొన్న తన రాజకీయ తెరంగేట్రంపై సంచలన ప్రకటన చేసిన రజనీకాంత్ వచ్చే ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని - ప్రజలంతా తమకు మద్దతుగా నిలవాలని కూడా చాలా విస్పష్ట ప్రకటన చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం తమిళనాట నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారు తమిళులను చేసి నవ్వుతున్నారని - ఈ తరహా పరిస్థితిని మార్చేసి - తమిళ ప్రజల గౌరవ మర్యాదలను నిలపేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ ప్రకటించారు. రజనీ ప్రకటనలోని ఈ అంశాలను ప్రస్తావించిన వర్మ... తమిళ ప్రజలు గౌరవం కోల్పోయారని - దానిని తిరిగి తీసుకొచ్చేందుకే తాను ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించినట్లుగా తెలిపారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్ ప్రస్తావన తెచ్చిన వర్మ... వచ్చే ఎన్నికల్లో పవన్ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపాలని కోరారు. లేని పక్షంలో తమిళ ప్రజలు రజనీని సూపర్ స్టార్ గా పిలుచుకున్నా... తెలుగు ప్రజలతో పాటు తన అభిమానులు కూడా పవన్ ను సూపర్ స్టార్ గా కాకుండా ఆర్డినరీ స్టార్ గా పరిగణించే ప్రమాదం ఉందని వర్మ ట్వీటారు.
అయినా వర్మ సదరు ట్వీట్లలో ఏమని వ్యాఖ్యానించారన్న విషయానికి వస్తే... *రజనీ ఓ గొప్ప ప్రకటన చేశారు. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల కారణంగా తమిళ ప్రజలు పరువు కోల్పోయారు. ఆ పరువును తిరిగి తీసుకొచ్చేందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ చెప్పారు. రజనీ మాదిరే పవన్ కూడా ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని భావిస్తున్నాను. అలా చేయని పక్షంలో పీకే ఫ్యాన్స్ తన అభిమాన నటుడు పవన్ కు రజనీకాంత్ కు ఉన్నంత దమ్ము లేదనే అనుకుంటారు. అంతేకాకుండా పవన్ అన్ని స్థానాల్లో పోటీ చేయకుంటే... అది తెలుగు ప్రజల పరువు ప్రతిష్ఠలను దిగజార్చేదే. అంతేకాకుండా తమిళ ప్రజల పరువు ప్రతిష్ఠల ముందు తెలుగు ప్రజల పరువు తీసేసిన వారవుతారు. ఇక పవన్ అన్ని స్థానాల్లో పోటీ చేయకుంటే ఆయన అభిమానులతో పాటుగా తెలుగు ప్రజలు కూడా ఆయనను సూపర్ స్టార్‌గా కంటే ఆర్డినరీ స్టార్ గా పరిగణించే ప్రమాదం ఉంది. రజనీ ఇక ముందూ సూపర్ స్టార్‌గానే కొనసాగినా.. పవన్ మాత్రం ఆర్డినరీ స్టార్‌గానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు* అని వర్మ తనదైన శైలిలో పవన్‌ను ఓ ఆటాడేసుకున్నారు. మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ గానీ, పవన్ గానీ ఏం సమాధానం చెబుతారో చూడాలి.