Begin typing your search above and press return to search.
వర్మ ట్విస్టులకు పోలీసులు కూడా షాక్ తింటున్నారే
By: Tupaki Desk | 18 Feb 2018 12:06 AM ISTదర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. వెబ్ సినిమా GSTపై ఓ చానల్లో చర్చ సందర్భంగా తనను దూషించారంటూ మహిళా సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదుపై వర్మపై ఈ రోజు ఆయన పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసుల విచారణలో భాగంగా వర్మను సీసీఎస్ స్టేషన్ లో దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం జీఎస్టీ సినిమాపై టీవీ చర్చలో భాగంగా సామాజిక కార్యకర్త దేవిపై చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. ఇవాళ ఆయన జీఎస్టీపై నమోదయిన కేసులపై సీసీఎస్ స్టేషన్ లో విచారణకు హాజరయిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం జరిగిన టీవీ చర్చలో పాల్గొన్న వర్మ.. దేవిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. తనను కావాలని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. నిజంగా తన వ్యాఖ్యలకు ఆమె మనోభావాలు దెబ్బతింటే సారీ అని వర్మ చెప్పారు. చర్చలో భాగంగా అలా మాట్లాడానే తప్ప ఆమెను కావాలని అన్న మాటలు కావని వర్మ తెలిపారు.
ఇక..తన విచారణపై ఆసక్తికరమైన రీతిలో వర్మ రియాక్టయ్యారు. తన ఫేస్ బుక్ అనూహ్యమైన పోస్టులు పెట్టారు. సీసీఎస్ పోలీసులు తనను విచారణ చేసిన తీరును బాగా నచ్చిందని పేర్కొన్నారు. వారి వృత్తి నిబద్ధత - పనితీరుతో తానెంతో థ్రిల్ కు గురయ్యానని వర్మ స్పందించారు. `నేను పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు ఫీలయ్యాను. దర్శకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే...ఇలాంటి చాన్స్‌కు నన్ను పరిశీలించగలరు` అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీనికి పూరిజగన్నాథ్ వెంటనే రియాక్టయ్యారు. సార్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. మీ డేట్లు ఖరారు అవడమే ఆలస్యం` అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా...వర్మను విచారించిన అనంతరం.. సీసీఎస్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాతో మాట్లాడారు. "రామ్ గోపాల్ వర్మ ల్యాప్ టాప్ సీజ్ చేశాం. ఎఫ్ ఎస్ ఎల్ కు పంపించాం. పోలాండ్, యూకేలో జీఎస్టీ చిత్రీకరణ జరిగిందని వర్మ తెలిపారు. ఆయన పోలాండ్ - యూకే వెళ్లడంపై విచారణ చేస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ సమయం కోరారు. వచ్చే శుక్రవారం మళ్లీ విచారణకు రావాలని వర్మకు చెప్పాం. సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుపైనా వర్మను ప్రశ్నించాం. టీవీ చర్చలో భాగంగానే మహిళపై వ్యాఖ్యలు చేశానని వర్మ సమాధానమిచ్చారు. జీఎస్టీ సినిమాను తాను తీయలేదని వర్మ తెలిపారు. జీఎస్టీ సినిమా కథ(కాన్సెప్ట్) మాత్రమే తనదని వర్మ పేర్కొన్నారు..." అని రఘువీర్ తెలిపారు.