Begin typing your search above and press return to search.

ఆ జంట రోజుకి 18. 4 కోట్ల సంపాదన!

By:  Tupaki Desk   |   17 Feb 2021 3:00 PM IST
ఆ జంట రోజుకి 18. 4 కోట్ల సంపాదన!
X
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఆయన భార్య రేఖ గత 11 సెషన్‌ లలో రోజుకు రూ.18.40 కోట్ల చొప్పున ఆదాయం పొందారు. వీరు ఎన్‌ సీసీ లిమిటెడ్‌ లో ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్ 2020తో ముగిసే త్రైమాసికానికి వీరికి ఈ కంపెనీలో రూ.7.83 కోట్ల షేర్లు ఉన్నాయి. ఎన్సీసీ నెట్ షేర్లలో ఇద్దరి వద్ద కలిసి 12.84 శాతం ఉన్నాయి. రాకేష్ ఝున్‌ ఝున్ ‌వాలా దేశీయ ప్రముఖ ఇన్వెస్టర్ ‌గా నిలిచారు. ఆయన పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో రిటర్న్స్ పొందుతున్నారు. జనవరి 29వ తేదీన ఎన్సీసీ స్టాక్ రూ.58.95 వద్ద క్లోజ్ అయింది. ఆ రోజుకు రాకేష్ వాటా రూ.461.77 కోట్లుగా ఉంది.

అయితే ఫిబ్రవరి 15వ తేదీ నాటికి 43.85 శాతం లాభపడింది. షేర్ నిన్న రూ.84.80 వద్ద క్లోజ్ అయింది. అప్పుడు రాకేష్ ఝున్‌ఝున్ దంపతుల వాటా రూ.664.26 కోట్లకు చేరుకుంది. అంటే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, రేఖల ఆదాయం ఈ 11 సెషన్లలో రూ.202.49 కోట్లు పెరిగింది. ఇతర సంస్థలతో పోలిస్తే ఎన్సీసీ ఇటీవలి కాలంలో ర్యాలీ చేసింది. ఇతర సంస్థలు 7 శాతం, 32 శాతం చొప్పున ర్యాలీ చేయగా, ఎన్సీసీ లిమిటెడ్ 44 శాతం వరకు ర్యాలీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఎన్సీసీ లిమిటెడ్ మొత్తం ఆదాయం రూ.1,942.85 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ.2,149.03 కోట్లుగా ఉంది. జనవరి 29వ తేదీ నుండి నిన్నటి వరకు సెన్సెక్స్ దాదాపు 5,900 పాయింట్లు, నిఫ్టీ 1680 పాయింట్ల వరకు ఎగిసింది. జనవరి 29న సెన్సెక్స్ 46,285 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 13,634 పాయింట్ల వద్ద ఉంది. బడ్జెట్‌కు ముందు సూచీలు వరుసగా ఆరు సెషన్లలో నష్టపోయాయి. అయితే బడ్జెట్ నుండి లాభపడ్డాయి.