Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే

By:  Tupaki Desk   |   19 Jun 2020 8:00 PM IST
బ్రేకింగ్: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే
X
ఏపీ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. సీఎం జగన్ తోపాటు మంత్రులు - ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వైసీపీ ఒక్కో రాజ్యసభ స్థానానికి 34 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలని నిర్ధేశించింది. వైసీపీ ఏజెంట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఉన్నారు.

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరుఫున మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రాంరెడ్డి, పరిమిళ్ నత్వాని బరిలోకి దిగారు. టీడీపీ తరుఫున వర్ల రామయ్య పోటీచేశారు.

ఈ ఎన్నికల్లో నలుగురు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ - ఆళ్ల అయోధ్య రామిరెడ్డి - పరిమళ్ నత్వాని - మోపిదేవి వెంకటరమణ గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో ఒక్కో వైసీపీ అభ్యర్థికి ఏకంగా 38 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం వైసీపీకి 152 ఓట్లు పోలయ్యాయి. 151మంది వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు జనసేన ఎమ్మెల్యే ఓటు కూడా వైసీపీకే పడినట్టు తెలుస్తోంది. ఇక వర్ల రామయ్యకు కేవలం 17ఓట్లు వచ్చి ఓడిపోయారు.

కాగా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు 23మంది ఉండగా.. వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే రావడం టీడీపీకి షాకింగ్ గా మారింది. టీడీపీ విప్ జారీ చేసినా ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.