Begin typing your search above and press return to search.
కేంద్ర వ్యవసాయ బిల్లులు రైతులకు న్యాయం చేస్తాయా?
By: Tupaki Desk | 23 Sept 2020 12:15 PM ISTప్రతిపక్షాలు రచ్చచేసినా.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కినా.. ప్రధాని మోడీ సార్ పంతం నెగ్గించుకున్నారు. పార్లమెంట్ లో రణగొణధ్వనుల మధ్య ఓటింగ్ కూడా పెట్టుకుండా మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులను ఆమోదించుకున్నారు. ఓటింగ్ పెడితే ఈ వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు సైతం ఓడగొట్టేవని తెలిసే మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా మూజువాణితో ఆమోదింపచేసుకుంది.
అయితే అనైతికంగా ఆమోదించుకున్నారంటూ వ్యవసాయ బిల్లులపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రతిపక్షాలు గోలగోల చేస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కారు.కార్పొరేట్లకు దోచిపెట్టేలా ఈ బిల్లులు ఉన్నాయనే విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ మాత్రం ఇది రైతులకు మేలు చేసే చట్టమని..వారికి మద్దతు ధర సహా అన్ని మంచే జరుగుతుందని చెబుతోంది. మరి బీజేపీ వాదన నిజమా? లేక ప్రతిపక్షాలు, రైతుల ఆరోపణలు నిజమా అన్న దానిపై తాజాగా ‘తుపాకీ.కామ్’ ఆన్ లైన్ లో పోల్ నిర్వహించింది. కరెంట్ బర్నింగ్ ఇష్యూ కావడంతో నెటిజన్లు కూడా బాగా స్పందించారు. పాఠకులు ఓట్లు వేయడంతో వ్యవసాయ బిల్లులపై జనాభిప్రాయం వెల్లడైంది.
‘కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు న్యాయం చేస్తాయా?’ అన్న ‘తుపాకీ.కామ్’ ప్రశ్నకు ‘చేస్తాయి అని’ 37.93శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు. ఇక ఈ బిల్లులు రైతులకు న్యాయం చేయవు అని 47.54శాతం మంది వ్యతిరేకించారు. ఇక ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ‘ఏమో చెప్పలేం’ అంటూ 14.54శాతం డోలాయమానంలో నిర్ణయించుకోలేకపోయారు.
పోల్ ను బట్టి మెజార్టీ ప్రజలు కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. ఇక అనుకూలించే వారు ఎక్కువే ఉన్నారు. ఇద్దరి మధ్య తేడా 10శాతంపైనే ఉంది. సో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై మెజార్టీ ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారని పోల్ ద్వారా అర్థమవుతోంది.