Begin typing your search above and press return to search.
రాజ్యసభ : మూడున్నర గంటల్లో 7 కీలక బిల్లులు పాస్ !
By: Tupaki Desk | 23 Sept 2020 2:00 PM ISTప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. కేంద్రం రైతుల మేలు కోసం అంటూ కొత్తగా వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినప్పటికీ , ఆ వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకి అన్యాయం జరుగుతుందంటూ విపక్షాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమయంలోనే కొంతమంది ఎంపీలు , సభలో గందరగోళం సృష్టించగా .. మరికొందరు వాకౌట్ చేసారు. దీనితో మంగళవారం 7 కీలక బిల్లులకు ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యసభ లో ఆమోద ముద్ర వేయించుకుంది. కాంగ్రెస్, లెఫ్ట్, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ, డీఎంకే మొదలైన పార్టీల గెర్హాజరుతో మూడున్నర గంటల్లోనే వీటిని మమ అనిపించింది. బీజేడీ, అన్నాడీఎంకే, వైసీపీ, టీడీపీ, జేడీయూ మొదలైన మిత్రపక్షాల ఎంపీలున్నా బిల్లులపై చర్చలో పాల్గొనలేదు. కొన్ని బిల్లులపై చర్చే జరగలేదు. లోక్ సభ ఈ బిల్లులకి 3 రోజుల కిందటే ఆమోదం తెలిపింది.
ఆమోదం పొందిన బిల్లుల్లో దేశంలో వేలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే బిల్లు కూడా ఉంది. దీని ప్రకారం ఇకపై రిటర్న్స్ ఫైలింగ్‌లో, ఆధార్-పాన్ లింకింగ్ లో డెడ్ లైన్ పెంచడానికి అవకాశమిచ్చే నిబంధనలున్నాయి. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి విరాళాలపై ఇచ్చే పన్ను మినహాయింపులు పీఎం కేర్స్ కూ వర్తించే బిల్లు ఉంది. సూరత్, భాగల్పూర్, రాయ్ చూర్, భోపాల్, అగర్తలాల్లోని ఐఐఐటీలకు ఇకపై స్వతంత్రంగా బీటెక్, ఎంటెక్, పీహెచ్ డీ డిగ్రీలను ప్రదానం చేసే అధికారం ఇచ్చే బిల్లును ఆమోదించింది.
మూడున్నర గంటల్లో ఏడు బిల్లులు పాసైన సమయంలో సభలో బీజేపీతోపాటు వైసీపీ, జేడీయూ, అన్నాడీఎంకే, బీజేడీ ఎంపీలు ఉన్నారు. వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో ఆదివారం కనీవినీ ఎరుగని పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. డివిజన్ ఓటింగ్ పెట్టాలని విపక్షాలు కోరినా పట్టించుకోకుండా.. ఎన్డీఏకు మెజార్టీ లేకపోయినా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ బిల్లులు పాస్ అయ్యాయని ప్రకటించడం వివాదాస్పదమైంది. డిప్యూటీ చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపిన ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్ష్ వేటు పడింది. దీంతో ఆ ఎంపీలు సోమవారం రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోనే దీక్ష నిర్వహించారు. వ్యవసాయ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విపక్షాలు ఏకంగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంతో వర్షాకాల సమావేశాలను ఇంతటితో ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై నేడు ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.