Begin typing your search above and press return to search.

రాజీవ్ హంత‌కుల‌కు విముక్తి.. సుప్రీం సంచ‌ల‌న ఆదేశం

By:  Tupaki Desk   |   11 Nov 2022 9:30 AM GMT
రాజీవ్ హంత‌కుల‌కు విముక్తి.. సుప్రీం సంచ‌ల‌న ఆదేశం
X
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలవరించింది. రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసేందుకు సుముఖత చూపడం, సోనియాగాంధీ కుటుంబం కూడా సానుకూలత చూపడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. తమిళనాడులో ని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశించింది. తమను విడుదల చేయాలంటూ పలుమార్లు దోషులు నళిని శ్రీహర్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అన్ని అంశాలను పరిగణన‌లోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని కీలకతీర్పు ఇచ్చింది. ఇదే కేసులో దోషిగా ఉన్న ఉన్న పెరారీవాలన్ను విడుదల చేస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలనే మిగిలిన ఆరుగురికి వర్తించేలా తీర్పు ఇచ్చింది.

1991 మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్‌గాంధీని హత్య చేశారు. ఈ కేసులో 1999 మేలో పెరారివాలన్‌, మురుగన్, శాంతమ్, నళినికి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో 11 ఏళ్ల జాప్యం కారణంగా సంతన్, మురుగన్, పెరారివాలన్‌ మరణశిక్షను సర్వోన్నత న్యాయస్థానం జీవిత ఖైదుగా మార్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.