Begin typing your search above and press return to search.
మనకు తెలీని నిజం.. మొదట్నించి ఆ రొయ్యలకు క్వారంటైన్
By: Tupaki Desk | 6 Jun 2020 9:30 AM ISTమాయదారి మహమ్మారి పుణ్యమా అని.. కొత్త కొత్త పదాలు వాడుకలోకి వచ్చేశాయి. అందులో ముఖ్యమైనది క్వారంటైన్. వైరస్ వ్యాప్తి జరిగిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఒక చోట ఉంచటం తెలిసిందే. మనకి ఇప్పుడు మొదలైనప్పటికి రొయ్యలకు మాత్రం ఎప్పటినుంచో ఈ క్వారంటైన్ విధానాన్ని అమలు చేస్తున్న ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
విదేశాలనుంచి తీసుకొచ్చే రొయ్య గుడ్లతో ఉన్న తల్లి రొయ్యల్ని ముందస్తు పరీక్షల్లో భాగంగా క్వారంటైన్ లో ఉంచటం అలవాటుగా చెబుతున్నారు. ఇందుకోసం అక్వాటైన్ సెంటర్లలో ఉంచి ప్రత్యేకంగా పరీక్షలు జరుపుతారు. అక్కడ జరిపిన టెస్టుల్లో ఎలాంటి వ్యాధుల్లేవని తేల్చిన తర్వాతే హేచరీలకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు.
దేశం మొత్తమ్మీదా రొయ్యలకు ఉన్న ఏకైక అక్వాటిక్ క్వారంటైన్ సెంటర్ చెన్నైలో ఉంది. విదేశాల నుంచి దేశానికి వచ్చే ఈ తల్లి రొయ్య (బ్రూడర్లు) లను ఈ కేంద్రంలో ముందస్తుగా పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే హేచరీల యజమానులకు పంపటం మొదట్నించి వస్తున్న ఆలవాటుగా చెబుతున్నారు. చెన్నైలో ఉన్న ఈ అక్వాటిక్ క్వారంటైన్ సెంటర్ తరహాలోనే ఏపీలోని విశాఖపట్నంలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
విశాఖలోని 30 ఎకరాల్లో రూ.35 కోట్లు వ్యయంతో ఈ అక్వాటిక్ క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో.. హేచరీలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని చెప్పక తప్పదు. దేశంలోనే ఎక్కువగా రొయ్యల ఉత్పత్తి ఏపీలోనే సాగుతోంది. దేశంలో మొత్తం 500 హేచరీలు ఉంటే.. అందులో ఏపీ వాటా అత్యధికం. ఏపీ మొత్తంలో 391 హేచరీలు ఉన్నాయి.
అంతేకాదు.. గత ఏడాది దేశం మొత్తమ్మీదా 8.05లక్షల టన్నుల వెనామీ రొయ్యల ఉత్పత్తి జరిగితే.. ఏపీ స్టేట్ లోనే డెబ్బైఒక్క శాతం అంటే.. 5.70 లక్షల టన్నులు ఉత్పత్తి చేయటం గమనార్హం. ఇదొక్కటి చాలు.. దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల సాగులో ఏపీ వాట ఎంతన్నది తెలిసేలా చేస్తుంది.