Begin typing your search above and press return to search.
జగన్ ఆటోవాలా.. అందరివాలా..
By: Tupaki Desk | 30 Dec 2018 3:10 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భాషా సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆ సినిమాలోని ‘నేను ఆటోవాణ్ని’ పాట అయితే ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఆ పాట మారుమోగుతూనే ఉంటుంది.
ఇప్పుడు ఇదే పాటను జగన్ ఫ్యాన్స్ వాడేశారు. ప్రజాసంకల్ప యాత్రలో జగన్ ఆటోవాలాలతో గడిపిన వీడియోను జతచేసి పాటను రూపొందించారు. ఈ పాట దుమ్మురేపుతోంది. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
వైఎస్ ఫ్యామిలీపై అభిమానంతో పదేళ్ల క్రితం నంద్యాల వీరా రెడ్డి అనే అభిమాని ‘వైఎస్ ఫ్యాన్ క్లబ్’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పదో వార్షికోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ కోసం ఓ పాటను రూపొందించి జగన్ ఫ్యాన్స్ కు అపురూప జ్ఞాపికను అందించారు. పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో కలిసి నడిచిన వీడియోను రజినీకాంత్ పాటతో అనుసంధానం చేసి జగన్ ను హైలెట్ చేస్తూ ఓ పాటను రూపొందించారు.
తాజాగా ఈ పాటను వైఎస్ ఫ్యాన్ క్లబ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అప్ లోడ్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా ఆటోడ్రైవర్లు ఈ పాటను తమ స్నేహితులకు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొత్త సంవత్సరం వేళ ప్రస్తుతం ఈ రీమిక్స్ పాట దుమ్మురేపుతోంది.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?