Begin typing your search above and press return to search.

హాలీవుడ్ న‌టుడు త‌ర్వాత స్పందించ‌ట‌మా ర‌జ‌నీ?

By:  Tupaki Desk   |   29 Jun 2019 6:36 AM GMT
హాలీవుడ్ న‌టుడు త‌ర్వాత స్పందించ‌ట‌మా ర‌జ‌నీ?
X
కొన్ని ప్రాంతాల‌కు కొంత‌మంది కేరాఫ్ అడ్ర‌స్ అన్న‌ట్లు ఉంటారు. ర‌జ‌నీ పేరు విన్నంత‌నే త‌మిళ‌నాడు గుర్తుకు వ‌స్తుంది. త‌మిళులు అత‌న్ని ఎంతగా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. త‌న‌ను అంత‌గా అభిమానించే వారికి క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ముందుండి వారికి ధైర్యం చెప్ప‌టం.. స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా తాను చేయాల్సినంత చేయాల్సిన అవ‌స‌రం ఉంది. మామూలు న‌టుడికైతే ఇవేమీ అక్క‌ర్లేదేమో కానీ..ర‌జ‌నీకాంత్ కు అందునా రానున్న రోజుల్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జాసేవ చేయాల‌ని త‌పిస్తున్న ఆయ‌న‌.. చెన్నై నీటి ఎద్ద‌డి మీద రియాక్ట్ కావాల్సింది ఎప్పుడు?

అక్క‌డెక్క‌డో అల్లంత దూరాన ఉన్న హాలీవుడ్ లో.. స‌రిగ్గా త‌మిళుల గురించి కూసింత అవ‌గాహ‌న లేని టైటానిక్ హీరో లియానార్డో డికాప్రియో ఫీలై.. వామ్మో.. ఎంత క‌ష్టం అంటూ చెన్నై నీటి ఎద్ద‌డి మీద రియాక్ట్ అయ్యారు. ఆయ‌నే ఇంత‌గా పీలైన‌ప్పుడు కోట్లాది త‌మిళుల గుండె చ‌ప్పుడుగా చెప్పే ర‌జ‌నీకాంత్ మ‌రెంత‌గా రియాక్ట్ కావాల్సి ఉంది చెప్పండి.

హాలీవుడ్ హీరో రియాక్ట్ అయిన మూడు రోజుల త‌ర్వాత.. తాజాగా ర‌జ‌నీకాంత్ రియాక్ట్ అయ్యారు చెన్నై నీటి క‌ష్టాల మీద మాట్లాడుతూ.. చెరువులు.. రిజ‌ర్వాయ‌ర్ల‌లో త‌క్ష‌ణ‌మే పూడిక తీయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. రిజార్వాయ‌ర్లు ఎండిపోవ‌టంతో నీళ్ల కోసం చెన్నై ప్ర‌జ‌లు ఎంత‌గా త‌ల్ల‌డిల్లిపోతున్నారో తెలిసిందే. ఇలాంటి వేళ ర‌జ‌నీ మాట్లాడుతూ తాగునీటి స‌ర‌ఫ‌రాలో ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. చేసిన దానికే అంత‌లా ఫీల్ అయితే.. చేయాల్సింది త‌గ్గిపోతుంద‌న్న విష‌యం సూప‌ర్ స్టార్ కు తెలీక‌పోవ‌టం ఏమిటి?