Begin typing your search above and press return to search.
విచారణకి రావాల్సిందే .. రజనీకాంత్ కు సమన్లు
By: Tupaki Desk | 5 Feb 2020 1:20 PM ISTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు సమన్లు జారీ అయ్యాయి. సాధారణంగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న రజినీ, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో రాజకీయ రంగప్రవేశం చేస్తా అని చెప్తున్న రజినీ ఈ విధంగా వరుసగా పలు కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. కానీ , రజినీ రాజకీయ జీవితానికి ఈ అంశం బాగా దోహద పడుతుంది అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా తూత్తుకుడి ఘటన విషయంలో ఆయనకి సమన్లు జారీ చేసారు. ఈ కేసు విచారణ కోసం మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వం లో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేయగా.. ఆ కమిషన్ తాజాగా రజనీకి సమన్లను జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి రజనీకాంత్ ఫిబ్రవరి 25న తమ ఎదుట హాజరు కావాలంటూ అందులో ఆదేశించింది
కాగా, తమిళనాడులోని తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా గతేడాది పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి కి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఆ తరువాత ఈ వ్యాఖ్యల పై వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన రజనీ, తనకు అన్నీ తెలుసని తెలిపారు. అప్పట్లో చేసిన అన్నీ తెలుసు అనే వ్యాఖ్యలపై తాజాగా సమన్లు జారీ అయ్యాయి. ఇకపోతే, ఈ కేసులో ఇప్పటి వరకు 379 మందిని కమిషన్ ప్రశ్నించింది.