Begin typing your search above and press return to search.

మునుగోడు మీద సారు లెక్కలు ఇవేనా? 10 నిమిషాల ఆమోదం వెనుక అదే కారణమా?

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:25 AM GMT
మునుగోడు మీద సారు లెక్కలు ఇవేనా? 10 నిమిషాల ఆమోదం వెనుక అదే కారణమా?
X
అనుకున్నట్లే జరుగుతున్నాయి. కాంగ్రెస్ ను విడిపోయి బీజేపీలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు అందజేసిన పది నిమిషాల వ్యవధిలోనే ఆయన రాజీనామా లేఖకు ఆమోద ముద్రపడటం.. అసెంబ్లీ సెక్రటరీ ఖాళీ అయిన మనుగోడు ఎమ్మెల్యే సీటుకు సంబంధించిన వివరాల్ని సైతం విడుదల చేయటం చూస్తే.. ఉప ఎన్నిక కోసం తెలంగాణ అధికారపక్షం కాస్తంత విశ్రాంతి కూడా అవసరం లేకుండా.. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఉప ఎన్నికకు తాను ఎదురుచూస్తున్న సంకేతాన్ని ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పది నిమిసాల వ్యవధిలో ఆయన రాజీనామాను ఓకే చేసిన వైనంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో దాన్ని ఆమోదించకుండా.. స్పీకర్ పరిశీలన కోసం పంపిన తర్వాత జరిగే ఆలస్యం మొత్తం తనను దెబ్బ తీస్తుందని కేసీఆర్ భావిస్తున్నారా? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వస్తున్న సమాధానం అవుననే చెబుతున్నారు. ఈ కారణంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా రాజీనామాను ఆమోదించినట్లు చెబుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల విషయంపై సీఎం కేసీఆర్ ఫ్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా చెబుతారు. ఇక్కడ బీజేపీ గెలుపు అంత సులువు కాదన్నది తెలిసిందే. ఇలాంటి వేళలోనూ ప్రజల్లోకి మరింత వెళ్లేందుకు వీలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. పార్టీకి హైప్ తీసుకురావటం చాలా ముఖ్యం. అక్కడ జరిగే త్రిముఖ పోటీలో తమకే ఓటు వేస్తారన్న నమ్మకంతో ఉన్నారు సీఎం కేసీఆర్.

బీజేపీకి పెద్దగా బేస్ లేని పార్టీ కావటం.. కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి లేకపోవటంతో.. టీఆర్ఎస్ కే గెలుపు అవకాశం ఉందన్న విషయంలో కేసీఆర్ నమ్మకంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే పది నిమిషాల్లో రాజీనామా ఆమోదం అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.దీని ద్వారా మైండ్ గేమ్ ను అప్లై చేశారంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డికి బోలెడంత కష్టాన్ని మిగులుస్తుందన్న నమ్మకంతో ఉన్న టీఆర్ఎస్.. ఉప ఎన్నికకు సంబంధించిన ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్న ఆలోచనలో భాగంగానే కేసీఆర్ రాజీనామా ఆమోదాన్ని రికార్డు వేగంతో చేయించినట్లుగా చెబుతున్నారు. ఇంత వేగంగా ఆమోదం లభిస్తుందన్న అంచనా వేయని ప్రత్యర్థులకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చేస్తుందన్నమాట వినిపిస్తోంది.

హడావుడిగా ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు సాధారణంగా తప్పులు జరుగుతుంటాయన్నది తెలిసిందే. అలాంటిదేమీ లేకుండా తమ వైపు ఉండటం.. ప్రత్యర్థులు తాము కోరుకున్నట్లుగా హడావుడి చేయటం తమకు కలిసి వస్తుందన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే.. ఆయన్ను బిల్లు కట్టేలా మారిందన్న మాట వినిపిస్తోంది.