Begin typing your search above and press return to search.

ఏపీలో గెలుపు జ‌గ‌న్‌ దే?..రాజ్ దీప్ తేల్చేశార‌బ్బా!

By:  Tupaki Desk   |   27 April 2019 9:56 AM GMT
ఏపీలో గెలుపు జ‌గ‌న్‌ దే?..రాజ్ దీప్ తేల్చేశార‌బ్బా!
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌కమైన పోలింగ్ ఎప్పుడో ముగిసిపోయింది. అయితే ఫ‌లితాల వెల్ల‌డికి ఇంకా చాలా స‌మ‌య‌మే వేచి చూడాల్సి ఉంది. వ‌చ్చే నెల 23న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. అంటే... ఇంకా 27 రోజులు వేచి ఉండాలి. త‌ప్ప‌దు మ‌రి. ప్ర‌జ‌ల తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్తైపోతే... ఆ ఈవీఎం ల‌న్నీ స్ట్రాంగ్ రూంల‌కు చేరిపోయాయి. అంటే తీర్పు లాకైపోయింద‌న్న మాటే. మ‌రి తీర్పు వ‌చ్చేదాకా ఎవ‌రూ ఎలాంటి అంచ‌నా లేకుండా ఉండ‌లేరు క‌దా. ఎవ‌రికి తోచిన రీతిలో వారు అంచ‌నాలు వేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ కు అనుమ‌తి లేదు కాబట్టి... వ‌చ్చే నెల 19న చివ‌రి ద‌శ పోలింగ్ ముగిసిన త‌ర్వాత గానీ ఎగ్జిట్ పోల్స్ రావు. మ‌రి ఇలాంటి త‌రుణంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి ఎలాంటి భంగం వాటిల్ల‌ని రీతిలో ఇప్పుడు ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ అంచ‌నాల‌ను వెలువ‌రిస్తున్నారు. ఈ అంచ‌నాల్లో ఇప్ప‌టిదాకా మెజారిటీ అంచ‌నాలు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనుకూలంగానే వెలువ‌డ్డాయ‌నే చెప్పాలి. తాజాగా మ‌రో ప్రముఖుడు కూడా ఏపీ ఓట‌ర్ల మ‌నోభావాన్ని ఆవిష్క‌రించేశారు. ఆయ‌నే ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రాజ్ దీప్ స‌ర్దేశాయి. జాతీయ రాజ‌కీయాల‌పైనే కాకుండా ఆయా రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై మంచి ప‌ట్టే ఉన్న స‌ర్దేశాయి... ఏపీ ఓట‌ర్ల ప‌ల్స్ పై నిన్న త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు.

ఏపీలో ఈ సారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే అనుకూలంగా ఫ‌లితాలు రానున్నాయ‌ని, జ‌గ‌న్ కే గెలుపు అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎన్నిక‌లు జ‌రిగిన తీరును కూడా ప్ర‌స్తావించిన స‌ర్దేశాయి.... ఏపీ బ‌రిలో చాలా పార్టీలే ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం టీడీపీ - వైసీపీ మ‌ధ్యే జ‌రిగింద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పోటీ అంతా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర్సెస్ చంద్ర‌బాబునాయుడుగానే సాగింద‌ని కూడా ఆయ‌న విశ్లేషించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓట‌ర్ల మొగ్గు జ‌గ‌న్ వైపే ఉంద‌ని ఆయ‌న తేల్చి పారేశారు.