Begin typing your search above and press return to search.

వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా

By:  Tupaki Desk   |   6 Feb 2018 12:49 PM GMT
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా
X
మొత్తానికి బీజేపీ - టీడీపీ లు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో క‌న్ ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఓ వైపు బ‌డ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని టీడీపీ బీజేపీని విమ‌ర్శలు చేస్తోంది. కానీ బీజేపీతో మిత్ర బంధాన్ని కొన‌సాగాలని పార్టీ అధిస్టానం తెలుగుత‌మ్ముళ్లుకు నూరిపోస్తుంది. సీఎం చంద్ర‌బాబు రాష్ట్రాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టి త‌న అవినీతి సామ్రాజ్యాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కాకుండా మేనేజ్ చేస్తున్నారు. కాబ‌ట్టే గ‌డిగ‌డికో పూట‌పూట‌కు ఒక్కో మాటమాట్లాడుతూ క‌న్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఉద‌యం భేటీలో మీతో యాగ‌లేకపోతున్నాం. మీరు వ‌ద్దు..మీతో పొత్తు వ‌ద్దు అంటూ న‌మ‌స్కారం పెట్టేస్తారు. సాయంత్రానికి మాట మార్చి రాష్ట్రాభివృద్ధికోసం త‌ప్ప‌క త‌లవంచుతున్నామ‌ని, లేదంటే కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదాను సాధించుకుంటామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారు. ఓవైపు పోరాటం అంటూనే కేంద్ర మంత్రి సుజనా చౌదరి పీఎం మోడీతో భేటీ అవ్వ‌డం చ‌ర్చాంశ‌నీయ‌మైంది.

బీజేపీ కూడా అదే త‌రహా ధోర‌ణిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర నిధుల‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ క్రెడిట్ కొట్టేస్తున్న టీడీపీ పై అవాకులు చెవాకులు పేల్చుతుంది. త‌ప్పా టీడీపీపై బీజేపీ స్టాండ్ ఏంట‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

మ‌రోవైపు పార్ల‌మెంట్ లో బీజేపీ- టీడీపీలు రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల‌కోసం పోరాటం చేస్తున్నా..అవి కూడా నామ‌మాత్రంగానే ఉన్నాయ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో బీజేపీ - టీడీపీ మిత్ర బంధంపై ప్ర‌ముఖ నేష‌న‌ల్ మీడియా జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. లోక్ స‌భ‌లో ఊహించ‌ని ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. ఇంత‌కీ టీడీపీ.. మోదీ ప్రభుత్వంలో భాగస్వామి అవునా? కాదా?’’ అంటూ ట్విటర్‌ లో ఆయన ప్రశ్నించారు.