Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఒకే రోజునా?

By:  Tupaki Desk   |   4 Sept 2019 11:09 AM IST
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఒకే రోజునా?
X
ఆసక్తికర వ్యాఖ్యలు చేశరాు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్. తాజాగా నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తామని.. దీనికి సంబంధించి ప్రధాన ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు. తెలంగాణలో ఓటు వేస్తున్న కొందరు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి మళ్లీ ఓటు వేస్తున్నారని.. ఇలాంటి బోగస్ ఓట్లను అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

బోగస్ ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఈ ప్రతిపాదనను ఈసీ ముందు ఉంచినట్లు చెప్పారు. తమ ప్రతిపాదనకు ఈసీ కూడా ఓకే చెప్పిందని పేర్కొన్నారు. రజత్ కుమార్ చెప్పిన దాని ప్రకారం ఒకేరోజు పోలింగ్ అంటే.. ఈసారి తెలంగాణలో ఎన్నికలు కాస్త ఆలస్యం జరగటమో.. లేదంటే ఏపీలో ఎన్నికలు కాస్త ముందుగా జరగటమో జరగాలి.

ఇదేమీ కాకుండా.. జమిలి ఎన్నికలు విషయంలో ఆసక్తిగా ఉన్న మోడీ మాష్టారు అనుకున్నట్లే జరిగితే.. సార్వత్రిక.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఒకే రోజు జరగటం ఖాయమన్న విషయం రజత్ కుమార్ మాటతో స్పష్టమైందని చెప్పాలి. అదే జరిగితే.. తుది ఫలితాల విషయంలోనూ కొంత మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. అటు తెలంగాణలో.. ఇటు ఆంధ్రాలో ఓటు వేస్తున్న వేలాదిమందికి రజత్ కుమార్ బ్యాడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి.