Begin typing your search above and press return to search.

'రాజాసింగ్' ఎపిసోడ్‌.. కూర్చున్న కొమ్మ‌కే!!

By:  Tupaki Desk   |   23 Aug 2022 7:38 AM GMT
రాజాసింగ్ ఎపిసోడ్‌.. కూర్చున్న కొమ్మ‌కే!!
X
రాజ‌కీయాల్లో ఉన్న‌వారు..ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిణామం.. ఎందుకంటే.. అవ‌స‌రం-అవ‌కాశం.. అనే కోణంలో నాయ‌కులు ఎలాంటి ప‌రిస్థితికైనా మొగ్గుచూపుతున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ఒక పార్టీలో ఉంటూ.. అదే పార్టీకి ఎర్త్ పెట్టే విధంగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌రిస్థి తి దేశంలో క‌నిపిస్తున్నంద‌న‌.. ఎవ‌రినీ.. త‌క్కువ‌గా అంచ‌నా వేసే అవ‌కాశం లేకుండా పోతోంది.ఈ ప‌రిస్థి తే..ఇప్పుడు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తోందా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ పార్టీ రావాల్సిన విష‌యంలో ఎవ‌రికీ భిన్నాభిప్రాయం లేదు. ప్ర‌జాస్వామ్యం అంటేనే భిన్న‌మైన పార్టీలు.. ప్ర‌జ‌ల హ‌క్కుల స‌మాహారం., సో..ఇలా చూసుకున్నప్పుడు.. తెలంగాణ‌లో బీజేపీ పార్టీ విస్త‌ర‌ణ‌పై ఎవ‌రికీ ఎలాంటి బాధా లేదు. అయితే.. బీజేపీ విస్త‌ర‌ణ విష‌యంలో నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు.. కొంద‌రు నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. పార్టీకి మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తోంద ని అంటున్నారు బీజేపీ అభిమానులు.. సానుబూతి ప‌రులు.

కీల‌క‌మైన మునుగోడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నించాలి. లేద‌.. పార్టీ విష‌యంలో వివాదాల‌కు దూరంగా ఉండాలి. కానీ, లేస్తే.. వివాదం.. కూర్చుంటే వివాదం అం టే.. పార్టీ మ‌నుగ‌డ‌పైనే ప్ర‌భావం ప‌డుతుందని చెబుతున్నారు.

రెండు రోజుల కింద పార్టీ అగ్ర‌నేత అమి త్ షా.. ప‌ర్య‌టించి వెళ్లారు.. దీనితాలూకు ఎఫెక్ట్‌ను బీజేపీ నేత‌లు ఎంజాయ్ చేసే లోపే వివాదాల్లో చిక్కు కున్నారు. అటు బండి.. ఇటు రాజా సింగ్ ఇద్ద‌రూ వివాదమ‌య్యారు.

అమిత్ షా.. చెప్పులు మోశార‌నే వాద‌న బండి ఇమేజ్‌పై తీవ్రంగా ప‌డింది. ఇక‌, బీజేపీ ప‌రిస్థితి ఇంతే .. అనే విమ‌ర్శ‌లు కూడా చుట్టుముట్టాయి. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని అమిత్‌షా పాదాల ద‌గ్గర పెట్టార‌నే విమర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు.. మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారితీసే ప‌రిస్థితిని.. మ‌ళ్లీ ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్ అల్ల‌ర్ల దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపించే ప‌రిస్థితిని క‌ల్పించింద‌ని అంటున్నారు.

ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తే.. రాజాసింగ్ వ్య‌వ‌హారంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నా రు. ఆయ‌న తీరు.. స‌మ‌యం చూసుకుని.. పార్టీని దెబ్బేసేలా ఉంద‌ని చెబుతున్నారు. ఆయ‌న కావాల‌నే ఇలా చేస్తున్నారా? లేక‌.. వ్యూహం ఏదైనా ఉందా? అనే సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.మొత్తంగా చూస్తే.. కూర్చున్న కొమ్మ‌నేన‌రుక్కుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.