Begin typing your search above and press return to search.

వైకాపాలోకి జీవిత రాజ‌శేఖ‌ర్‌

By:  Tupaki Desk   |   1 April 2019 4:12 AM GMT
వైకాపాలోకి జీవిత రాజ‌శేఖ‌ర్‌
X
రంగుల ప్ర‌పంచం మొత్తం వైఎస్సార్సీపీ వైపు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ నుంచి మెజారిటీ సెల‌బ్రిటీలు వైకాపా తీర్థం పుచ్చుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కాబోయే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అని బ‌లంగా న‌మ్ముతున్న సెల‌బ్రిటీలంతా వెన‌కా ముందూ చూడ‌కుండా జ‌గ‌న్ పార్టీలో చేరుతున్నారు. ఏపీ ప్ర‌జ‌ల కోసం వైకాపా ప్ర‌క‌టించిన ప‌థ‌కాలు బావున్నాయ‌ని, గెలుపు గుర్రం ఎక్కేందుకు ఇంత‌కుమించిన మంచి దారి లేద‌ని టాలీవుడ్ హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు భావిస్తున్నార‌ట‌. అందుకే వైకాపాలో చేరేందుకు మెజారిటీ సెల‌బ్రిటీలు ఆస‌క్తి చూపిస్తున్నార‌న్న‌ది ఓ స‌ర్వే.

ఇటీవ‌లే అలీ, మంచు మోహన్ బాబు వైఎస్సార్సీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే తాజాగా జీవిత‌, రాజ‌శేఖ‌ర్ జంట కూడా వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు మార్గం సుగుమం చేసుకున్నార‌ని తెలుస్తోంది. నేడు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో ఆ పార్టీలో చేర‌నున్నార‌ని చెబుతున్నారు. అందుకోసం నేడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసేందుకు జీవిత‌-రాజ‌శేఖ‌ర్ దంప‌తులు వెళుతున్నార‌ని తాజాగా స‌మాచారం అందింది.

జీవిత - రాజ‌శేఖ‌ర్ రాజ‌కీయాల్లో ద‌శాబ్ధ కాలంగా యాక్టివ్ గానే ఉన్నారు. 2011లో వైకాపాలో చేరారు. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాల న‌డుమ‌ తేదేపాలో మారారు. అటుపైనా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో భాజ‌పాలోకి షిఫ్ట‌య్యారు. ఈ ఎన్నిక‌ల్లో వైకాపాలోకి చేరుతున్నారు. ఇప్ప‌టికే మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) కొత్త‌ క‌మిటీలో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ కీల‌క ప‌ద‌వుల్ని అలంక‌రించిన సంగ‌తి తెలిసిందే. క్రియాశీల రాజ‌కీయాల్లోనూ జ‌గ‌న్ కాబోయే సీఎం అన్న న‌మ్మ‌క‌మే వీరు ఈ పార్టీలో చేర‌డానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఏపీ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ జ‌గ‌న్ కు అనుకూలం అని స‌ర్వేలు చెబుతున్నాయి. ఆ క్ర‌మంలోనే వెల్లువ‌లా టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఆ పార్టీలో చేరుతున్న సంగ‌తి తెలిసిందే.