Begin typing your search above and press return to search.

యాంగ్రీ స్టార్ సరసన యంగ్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   16 Sept 2019 12:39 PM IST
యాంగ్రీ స్టార్ సరసన యంగ్ బ్యూటీ!
X
ఈమధ్య సీనియర్ హీరోలందరూ కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య.. సూటబుల్ హీరోయిన్ ను ఎంచుకోవడం. కొంతమంది స్టార్ హీరోయిన్లు సీనియర్లతో జోడీ కట్టేందుకు ఆసక్తి చూపించరు. కొందరు హీరోయిన్లు మరీ కుర్రగా ఉంటారు కాబట్టి జోడీ కడితే ఎబ్బెట్టుగా ఉంటుందని నిర్మాతలే ఎంచుకోరు. మరీ కొత్త హీరోయిన్లను తీసుకోవడం కష్టమే. దీంతో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడానికి దర్శకనిర్మాతలు తీవ్రమైన కసరత్తు చేయాల్సి వస్తోంది.

యాంగ్రీ స్టార్ డా. రాజశేఖర్ కూడా సీనియర్ హీరోనే కాబట్టి ఆయనకు కూడా ఇదే సమస్య. రీసెంట్ గా రాజశేఖర్ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వలో తెరకెక్కనున్న ఈ సినిమాను జీ. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. అయితే సినిమాను ప్రకటించిన సమయానికి హీరోయిన్ ను ఫైనలైజ్ చేయలేదు. తాజాగా నందిత శ్వేతను రాజశేఖర్ కు హీరోయిన్ గా లాక్ చేశారని సమాచారం. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.. 'ప్రేమకథా చిత్రమ్ 2'.. 'అభినేత్రి 2' సినిమాల్లో నటించిన నదిత శ్వేతకు తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపే ఉంది. నిఖిల్ సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' నందిత శ్వేత నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఇదిలా ఉంటే రాజశేఖర్ లాస్ట్ సినిమా 'కల్కి' పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరి ఈ కొత్త సినిమాతో అయినా రాజశేఖర్ కు హిట్టు దక్కుతుందేమో వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే నందిత శ్వేతకు కూడా మంచి ఆఫర్లు రావడం ఖాయమే.