Begin typing your search above and press return to search.
రజనీ రాజకీయ భవితవ్యం తేలేది రేపే ... ఏ వైపు మొగ్గు చూపుతాడో ?
By: Tupaki Desk | 29 Nov 2020 10:20 AM ISTరజినీకాంత్ రాజకీయ భవితవ్యం ఏమిటి అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా అదిరిలో మెదులుతూనే ఉంది. ఎందుకంటే తమిళనాడు లో వచ్చే ఏడాది లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి సమయంలో తలైవా ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే , ఎన్నికలకి సమాయత్తం అయ్యే సమయం ఉండదు. మిగిలిన అన్ని పార్టీలు కూడా ఇప్పటికే ఎన్నికలకి వ్యూహాలని రచించి ఆ విధంగానే ముందుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈసారి తమిళనాడు లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చూస్తుంది. ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా సరిగ్గా వారం రోజుల కిందట తమిళనాడులో పర్యటించి వెళ్లారు. ఈ సమయంలో సోమవారం రజినీ కీలక సమావేశం నిర్వహిస్తుండటం తో రజిని నుండి ఎదో ఒక కీలక నిర్ణయం ఉండచ్చు అని ఊహిస్తున్నారు.
రజినీకాంత్ గతంలోనే పార్టీని ప్రకటించారు గానీ, దాన్ని క్రియాశీలకంగా ముందుకు తీసుకుపోలేదు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆ దిశగా ఎలాంటి సంకేతాలను సైతం ఇవ్వలేకపోయారు. అయితే , త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి అన్న తరుణంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ పదాధికారులు, జిల్లాల కార్యదర్శులతో భేటీ కానున్నారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. పార్టీలో వివిధ దశల్లో ఉన్న క్యాడర్, అభిమాన సంఘాల ప్రతినిధులతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రజినీకాంత్ మంతనాలను నిర్వహించనున్నారు. అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తుంది.
అయితే , రజినీకాంత్ ఏ విధమైన నిర్ణయం ప్రకటించినా కూడా అది ఖచ్చితంగా పెను సంచలనమే అవుతుంది. ఎందుకంటే తమిళ రాజకీయాలు ఇప్పుడు అలా ఉన్నాయి. అయితే , ఈ భేటీ తర్వాత రజినీకాంత్ పూర్తిగా దూరంగా ఉండబోతున్నాను అని కూడా ప్రకటింవచ్చు ,అయితే పార్టీని ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు. మరో అంశం ఏమిటంటే .. సొంతంగా వచ్చే ఏడాది ఎన్నికల్లో అభ్యర్ధులని బరిలో దింపి ముందుకుపోవడం , లేక జేపీ వైపు మొగ్గు చూపడం. రజిని రేపు నిర్వహించబోయే సమావేశం లో ఈ మూడు అంశాలే ప్రధాన అంశాలుగా మారనున్నాయి. అయితే రజినీకాంత్ ఒంటరిగానే బరిలో నిలవాలని నిర్ణయం తీసుకుంటే .. పదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నా డీఎంకే, స్టాలిన్ సారథ్యంలోని ప్రతిపక్ష డీఎంకేను ఢీ కొని రజినీకాంత్ స్థాపించిన రజినీ మక్కళ్ మండ్రం.. ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపిస్తుంది అనేది ఓ ప్రశ్న. అయితే , కొన్ని కొన్ని సందర్భాల్లో రజినీకాంత్ బీజేపీని ప్రశంసిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం వంటి ఒకట్రెండు కీలక అంశాలపై స్పందించలేదు. ఆయన వైఖరి ముందు నుంచీ బీజేపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఒకవేల ఒంటరిగా పోటీ చేసినప్పటి కూడా రజినీకాంత్ బీజేపీ కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు.