Begin typing your search above and press return to search.

రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యమం చేశాడంట..: యూట్యూబ్లో వీడియోస్ లేవే..

By:  Tupaki Desk   |   6 Aug 2022 2:30 PM GMT
రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యమం చేశాడంట..: యూట్యూబ్లో వీడియోస్ లేవే..
X
'తెలంగాణ కోసం మేం ఉద్యమించా.. కేసీఆర్ కాదు..'..'కాంగ్రెస్లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు.. ఎవరెవరికో పదవులిస్తున్నారు..' ఇవన్నీ భువనగిరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు ఈ వీడియోలను జోడిస్తూ సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డికి సపోర్టుగా కొందరు పోస్టులు పెడుతున్నారు.

కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఎలా విడిచిపెట్టాలని అనిపించిందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి అభిమానులు ఈ వీడియోలు పెట్టి అందుకే విడిచిపెడుతున్నామని చెబుతున్నారు. ఈ పోస్టులకు కొందరు సెటైరికల్ కౌంటర్ వేస్తున్నారు.'రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క వీడియోను యూట్యూబ్లో చూపించండి..' అంటూ కొశ్చెన్స్ వేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యే పదవి కోసం చేసిన రాజీనామాను ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రెండు రోజులకే మునుగోడులో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంతో మందికి జీవితాన్నిచ్చిందని, అయినా పార్టీకి అన్యాయం చేస్తున్నారన్నారు.

కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తన స్టైల్లో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవారికి గుర్తింపు లేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొని, ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న వారిని పట్టించుకోకుండా.. ఎవరెవరో కొత్తవారు రాగా.. వారికి పార్టీ పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. వీటితో తోడు గతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో 'తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది మేమేనని.. ఉద్యమం కోసం తాము తమ పదవులకు రాజీనామాలు చేశామని' అన్నారు.

రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలపై కొందరు సెటైరికల్ రిప్లై ఇస్తున్నారు. ఉద్యమంలో పదవులను అంటిపెట్టుకున్న నీవు ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నావో చూపిస్తావా..? అని అడుగుతున్నారు. ఓ వైపు ప్రాణాలను ఆర్పించి.. రోడ్లపై ధర్నాలు చేసిన సమయంలో కనిపించావా..? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక కొందరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క వీడియో యూట్యూబ్ లో కనిపించడం లేదే..? అని కామెంట్లు పెడుతున్నారు.