Begin typing your search above and press return to search.

మాట నెగ్గించుకున్న రాజాసింగ్‌..ఆ వెంట‌నే కేసీఆర్‌ కు ఆఫర్‌

By:  Tupaki Desk   |   19 Jan 2019 8:48 AM GMT
మాట నెగ్గించుకున్న రాజాసింగ్‌..ఆ వెంట‌నే కేసీఆర్‌ కు ఆఫర్‌
X
గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ నేత రాజాసింగ్ త‌న మాటే నెగ్గించుకున్నారు. ఎంఐఎం నేత‌ ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేయను అని ప్ర‌క‌టించిన సంచ‌ల‌నం సృష్టించిన రాజాసింగ్‌...నూత‌న సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంపికయిన అనంత‌రం నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీక‌ర్ పోచారం రాజాసింగ్ చేత శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేయించారు. రాజాసింగ్ హిందీలో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.

అనంత‌రం మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ ధర్మం పట్ల - దేశం పట్ల నమ్మకం లేని ఎంఐఎం నేత‌ ప్రొటెం స్పీకర్‌ గా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పానని గుర్తు చేశారు. భారత్ మాతకి జై అనడానికి సిగ్గుపడేవారు ప్రొటెం స్పీకర్ గా ఉంటే ఎలా ప్రమాణ స్వీకారం చెయ్యాలి? అని రాజాసింగ్ ప్ర‌శ్నించారు. ``15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం అని అన్న వ్యక్తులు ఎంఐఎం పార్టీ నేతలు. హిందువులను గౌరవించని వ్యక్తుల పార్టీ MIM. బంగారు తెలంగాణ చేయాలంటే కేసీఆర్ మా అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి. అలా వ్య‌క్తులకు విలువ ఇవ్వ‌ని పార్టీ నేత ముందు ప్ర‌మాణ‌స్వీకారం చేయలేను.`` అని వెల్ల‌డించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో చాలా అభివృద్ధి చేశార‌ని రాజాసింగ్ తెలిపారు. అయితే, మరింత అభివృద్ధి చేయాలంటే ప్రజల మనోభావాలు గమనించాలని ఆయ‌న కోరారు. నేను తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు దీన్ని కేసీఆర్ గారు పరిశీలనలోకి తీసుకోవాలి అని రాజాసింగ్ సూచించారు.