Begin typing your search above and press return to search.
ఇలా మాట్లాడితే ఫాలోయర్స్ ను పోగొట్టుకోవటం ఖాయం రాజాసింగ్
By: Tupaki Desk | 18 Aug 2020 4:01 PM ISTమనసుకు తోచింది మాట్లాడే నేతలు మన చుట్టూ చాలామందే కనిపిస్తారు. ఇలాంటి వారి మాటల్ని సైతం తమ వాదనల్లో వినిపించేటోళ్లకు కొదవ లేదు. వెనుకా ముందు చూసుకోకుండా.. తాను నమ్మిన సిద్ధాంతం తప్పించి మరింకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరించే నేతల్లో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకరు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఏకైక హిందూత్వ నాయకుడిగా ఆయన్ను అభివర్ణిస్తారు. దీనికి తగ్గట్లే ఆయన తన తీరును మార్చుకోకుండా.. సందర్భం ఏదైనా సరే.. అంశాన్ని తన కోణంలో నుంచే కానీ మరో కోణం వైపునకు ఆలోచించేందుకు ససేమిరా అనే రాజాసింగ్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి.
వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించటాన్ని రాజాసింగ్ తీవ్రంగా తప్పు పట్టారు. పండక్కి సరిగ్గా నాలుగు రోజుల ముందుగా పండుగను ఇంటికే పరిమితం చేసుకోవాలని చెప్పటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్.. నవరాత్రి ఉత్సవాల్ని ఇంట్లోనే జరుపుకోవాలనే ప్రభుత్వం మరి బక్రీద్ కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక మంది ఇబ్బందులకు గురి కావటం ఖాయమన్నారు. కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదన్న ఆయన.. అప్పటివరకు హిందూ పండుగల్ని జరుపుకోనివ్వరా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధూల్ పేటలో వినాయక విగ్రహ తయారీదారుల్ని ఆదుకోవాలని కోరుతున్న ఆయన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో హిందూ పండగల్ని జరుపుకోనివ్వరా? అంటూ కేసీఆర్ సర్కారును ప్రశ్నిస్తున్న రాజాసింగ్ తీరు అంతో ఇంతో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఆయన వెంటనే ఉండే వారు.. ఆయనకు నైతిక మద్దతుగా నిలిచే వారు వెనక్కి తగ్గే వీలుంది. ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలే తప్పించి.. కరోనా సుదీర్ఘకాలం సాగుతుందన్న పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సరి కాదన్న విషయాన్ని రాజాసింగ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. రాజా సింగ్ అనే నేను.. మొండిగానే మాట్లాడతానని చెప్పుకునే ఆయన మాటలు అన్ని సందర్భాల్లోనూ సూట్ కాదన్నది మర్చిపోకూడదు. ఇక.. బక్రీద్ ప్రస్తావనకు తెలంగాణ సర్కారు వెనువెంటనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివే ప్రభుత్వాన్నిఎక్కువగా డ్యామేజ్ చేస్తాయని చెప్పక తప్పదు.