Begin typing your search above and press return to search.
ఆత్మహత్యాయత్నం చేసిన రాజారమణి..రఘునందన్ పై విమర్శలు
By: Tupaki Desk | 17 Nov 2020 8:40 PM ISTబీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అత్యాచార ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచిన రాజా రమణి అనే మహిళ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు ఒక ప్రధాన మీడియాలో వార్త కథనం ప్రసారం చేసింది. ఆ మీడియా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రాజా రమణి అనే మహిళ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు ప్రధాన మీడియా తెలిపింది. రఘునందన్ తోపాటు పలువురు పోలీసులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారని పేర్కొన్నారు.
అత్యాచారం కేసులో న్యాయం జరగలేదని.. 20 ఏళ్లుగా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆమె వాపోయారు. వేధింపులకు గురిచేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే రఘునందన్, ఆర్సీపురం పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరారని మీడియా తెలిపింది. న్యాయం జరగడం లేదనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె చెప్పినట్లు అందులో పేర్కొన్నారు.
కాగా రాజారమణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆమెను ఆర్సీపురం పోలీసులు పటాన్ చెరులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి ఇంటికి పంపించినట్టు సమాచారం.
న్యాయవాది రఘునందన్ రావును ఓ కేసు విషయమై తాను ఆశ్రయించగా కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడంటూ రాజారమణి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. మానహక్కుల సంఘాన్ని ఆమె అప్పట్లో ఆశ్రయించారు. తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది.