Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రా: 121 వీడియోలు.. 1.2 మిలియన్ డాలర్లకు విక్రయం?

By:  Tupaki Desk   |   25 July 2021 5:43 AM GMT
రాజ్ కుంద్రా: 121 వీడియోలు.. 1.2 మిలియన్ డాలర్లకు విక్రయం?
X
రాజ్ కుంద్రా కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవలే ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మరో విషయాన్ని పోలీసులు కనుగొన్నారు.

121 శృంగార వీడియోల అమ్మకం ద్వారా 1.2 మిలియన్ అమెరికా డాలర్ల విలువైన అంతర్జాతీయ ఒప్పందాన్ని చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిసింది. ఈ భారీ డీల్ ను కుదుర్చుకోవడానికి రాజ్ కుంద్రా చర్చల దశలో ఉన్నట్టు వెల్లడైంది.

దర్యాప్తు అధికారులు ప్రస్తుతం కుంద్రా రెండు బ్యాంకు ఖాతాలను స్కాన్ చేస్తున్నారు. ఒకటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతాతోపాటు మరొకటి ‘యెస్ బ్యాంకు’ ఖాతా. ఈ రెండింటిలోని డబ్బుల లెక్కలను తవ్వి తీస్తున్నారు.

వాస్తవానికి ఈ రెండు బ్యాంకు ఖాతాలు అశ్లీల వీడియోల నుంచి వచ్చే ఆదాయంతో ఆన్ లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించబడ్డాయని తేలిందట.. నిన్న రాజ్ కుంద్రాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జుమూలోని ఆయన నివాసానికి తీసుకొని వచ్చారు. అతడి భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని అతడితో కలిసి ప్రశ్నించారు. ఈ అశ్లీల రాకెట్ లోని ప్రాపర్టీ సెల్ గురించి ఈ జంటను ప్రశ్నించారు.

పోలీసులు శిల్పా స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అని తెలుసుకోవడానికి ఆమె బ్యాంక్ ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఇక రాజ్ కుంద్రా ఏర్పాటు చేసిన ‘హాట్ షాట్స్’ యాప్ గురించి.. కంటెంట్ గురించి శిల్పాశెట్టికి తెలియదని ముంబై పోలీసులు తెలిపారు. హాట్ షాట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. రాజ్ కుంద్రా అమాయకుడని.. ‘ఎరోటికా’కు ‘అశ్లీల వీడియోల’కు తేడా ఉందని.. ‘ఎరోటికా’ అశ్లీలం కాదని శిల్పా విచారణలో తెలిపినట్టు సమాచారం.

ఇక మరోవైపు రాజ్ కుంద్రా న్యాయవాది సైతం కోర్టులో దీన్ని అశ్లీల కంటెంట్ అనడాన్ని తప్పుపట్టారు. ఇది ఎరోటికా అని వాదించారు. దీన్ని అశ్లీలంగా చూడవద్దని కోరారు.

ఇక మోడల్ సాగరిక తాజాగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేసినప్పటి నుంచి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.